Breaking News

సింగిల్స్‌కు నో ఎంట్రీ.. త్వరలో మీ భార్యతో రండి..

Published on Thu, 11/27/2025 - 20:23

‘ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి’ అంటూ ఒక రెస్టారెంట్ పెట్టిన బోర్డు ఇప్పుడు సోషల్‌మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. మారుతున్న సామాజిక పోకడలు, ఏకాంతంగా జీవించే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఒక నూడిల్ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే కస్టమర్లకు సర్వీసు చేయబోమని బోర్డు పెట్టడం వివాదానికి కారణమైంది.

దక్షిణకొరియా జియోలా ప్రావిన్స్‌లో ఉన్న యోసు నగరంలోని ఒక నూడిల్ రెస్టారెంట్ వెలుపల ఉంచిన నోటీసు బోర్డు చర్చకు దారితీసింది. కొరియా టైమ్స్‌లోని వివరాల ప్రకారం.. ఒక సందర్శకుడు ఈ నోటీసును ఫోటో తీసి ఆన్‌లైన్‌లో పోస్ట్ చేయగా అది త్వరగా వైరల్ అయింది. ఈ నోటీసులో సోలో డైనర్ల కోసం కొన్ని సూచనలు ఉన్నాయి.

  • రెండు ఐటమ్స్‌ ఆర్డర్‌ చేయండి.

  • రెండు ఐటమ్స్‌ తినండి.

  • మీరు ఒంటరిగా ఉంటే మీ స్నేహితుడిని పిలవండి.

  • తదుపరి మీ భార్యతో రెస్టారెంట్‌కు రండి.

  • ఒంటరితనానికి ఇక్కడ చోటు లేదు.. దయచేసి ఒంటరిగా రాకండి.. అని ఉన్నాయి.

ఈ పోస్ట్‌పై ఆన్‌లైన్‌లో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. చాలా మంది రెస్టారెంట్ వైఖరిని విమర్శించారు. ఒంటరిగా తినడం అనేది ఒంటరితనంతో ఎందుకు సమానం అవుతుందని ప్రశ్నించారు. కస్టమర్లకు విలువ ఇవ్వడం లేదని వాదించారు. అయితే, మరికొంతమంది ఈ విధానాన్ని సమర్థించారు. తమ వ్యాపారంలో అలాంటి నిర్ణయాలు తీసుకునే హక్కు యజమానికి ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ‘కేంద్రం లేబర్‌ కోడ్స్‌ మాకొద్దు’.. అందులో ఏముంది?

Videos

పంచాయతీ పనులు చేయొద్దంటూ నన్ను బెదిరిస్తున్నారు! సర్పంచ్ సెల్ఫీ వీడియో

లక్కుంటేనే దర్శనమా?

మార్కెట్ కు కొత్త జోష్.. నిఫ్టీ సరికొత్త రికార్డ్

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)