Breaking News

రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు

Published on Thu, 11/27/2025 - 15:17

అమెరికా ఆంక్షలు అమల్లోకి రాకముందే నవంబర్‌ నెలలో భారతీయ రిఫైనరీలు రష్యా నుంచి ముడి చమురు సరఫరాలను భారీగా పెంచాయి. దీని ఫలితంగా నవంబర్ 2025లో రష్యా నుంచి భారతదేశం ముడి చమురు దిగుమతులు రోజుకు సగటున 1.9 మిలియన్ బ్యారెల్స్‌తో రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

గ్లోబల్ రియల్ టైమ్ డేటా అనలిటిక్స్ ప్రొవైడర్ కెప్లెర్ (Kpler) వెల్లడించిన వివరాల ప్రకారం నవంబర్ 2025లో రష్యా అతిపెద్ద ముడి చమురు కొనుగోలుదారుగా భారత్‌ నిలిచింది. ఈ నెలలో ఇప్పటివరకు కార్గోలు సగటున రోజుకు 1.886 మిలియన్ బ్యారెల్స్‌ చమురు దిగుమతి చేసుకున్నాయి.

గణనీయ పెరుగుదల

నవంబర్ 2025లో చమురు దిగుమతులు అంతకుముందు నెలతో పోలిస్తే 17 శాతం పెరిగాయి. 2024లో ఇదే నెలతో పోలిస్తే దాదాపు 6 శాతం అధికమయ్యాయి. అలాగే 2023లో ఇదే నెలతో పోలిస్తే 12 శాతం పెరిగాయని కెప్లర్‌ డేటా వెల్లడించింది. నవంబర్ 21లోపు కొనుగోళ్లు పెరగడంతో భారతదేశానికి రష్యన్ క్రూడ్‌ దిగుమతి 5 నెలల గరిష్టానికి చేరుకుంటుందని భావిస్తున్నారు. ఎందుకంటే, నవంబర్ 21 నుంచే రోస్‌నెఫ్ట్‌(Rosneft), లుకోయిల్ (Lukoil)పై అమెరికా ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో అంతకుముందే భారీగా క్రూడ్‌ను దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తుంది.

తగ్గుముఖం పట్టే అవకాశం

నవంబర్ 21 తర్వాత రష్యా నుంచి భారతదేశం చమురు దిగుమతులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నప్పటికీ, ఇది తాత్కాలికంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇది సరఫరా గొలుసులను పునర్వ్యవస్థీకరించడానికి వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: నిచ్చెన ఎక్కితేనే బ్యాంకులోకి ప్రవేశం..

Videos

దళిత IPSలపై వివక్ష.. CID చీఫ్ కు నోటీసులు

ఒక్కరి కంటే ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే.. పదేళ్ల జైలు శిక్ష..!

క్లైమాక్స్ కు కుర్చీ వార్!

అనంతపురం జిల్లాలో దారుణం.. కొడుకు గొంతుకోసి తల్లి ఆత్మహత్య..

తుఫాన్ అలర్ట్.. దూసుకొస్తున్న దిత్వా

మసిబొగ్గుల్లా భవనాలు.. మంటల్లో 300 మంది

అనుచరులతో మా ఇంటికొచ్చి..! బాధితురాలు సంచలన నిజాలు

మహిళ అని కూడా చూడకుండా చీర పట్టుకొని లాక్కెళ్లి.. కాళ్లతో తన్నుతూ..!!

దళారుల రాజ్యం! ధాన్యం కొనుగోలు గందరగోళం

నా ప్రాణాలు పోయినా.. నిన్ను మాత్రం.. కోటంరెడ్డికి నెల్లూరు మేయర్ భర్త ఛాలెంజ్

Photos

+5

స్వామి అయ్యప్ప పడిపూజలో వితికా షేరు దంపతులు

+5

సింపుల్‌గా మరింత అందంగా అనసూయ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ డైరెక్టర్ (ఫొటోలు)

+5

అరుణాచలంలో జబర్దస్త్ కమెడియన్ పంచ్‌ ప్రసాద్ ప్రత్యేక పూజలు (ఫొటోలు)

+5

Rahul Sipligunj - Harinya Reddy : వైభవంగా సింగర్ రాహుల్‌ సిప్లిగంజ్‌ వివాహం (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అవుతున్న అప్సరరాణి (ఫొటోలు)

+5

రాజన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌.. చీరకట్టులో ఎంత బాగుందో! (ఫోటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’మూవీ రిలీజ్ ట్రెండింగ్ లో భాగ్యశ్రీ బోర్సే (ఫొటోలు)

+5

‘మరువ తరమా’ సినిమా ప్రీ రిలీజ్(ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ (ఫొటోలు)