పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
విమానాల కొనుగోలుకు రూ.7270 కోట్లు!: ఇండిగో
Published on Sat, 11/22/2025 - 18:58
దేశీ విమానయాన కంపెనీ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ విమానాల కొనుగోలుకి సిద్ధపడుతోంది. ఇందుకు సొంత అనుబంధ సంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రయివేట్ లిమిటెడ్‌కు 82 కోట్ల డాలర్లు (రూ. 7,270 కోట్లు) అందించనుంది.
ఇండిగో బ్రాండ్ విమాన సర్వీసుల కంపెనీ ఈక్విటీ షేర్లు, నాన్‌క్యుములేటివ్ ఆప్షనల్లీ కన్వర్టిబుల్ రిడీమబుల్ ప్రిఫరెన్స్ షేర్లు(ఓసీఆర్‌పీఎస్) జారీ ద్వారా పెట్టుబడులను సమకూర్చనుంది. ఒకేసారి లేదా దశలవారీగా వీటి జారీని చేపట్టనున్నట్లు ఇండిగో తెలియజేసింది. నిధులను ప్రధానంగా విమానాల కొనుగోలుకి వినియోగించనున్నట్లు వెల్లడించింది. ఇండిగో ఇప్పటికే 411 విమానాలను కలిగి ఉంది. వీటిలో 365 విమానాలు నిర్వహణలో ఉన్నట్లు విమాన ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్లేన్‌స్పాటర్.నెట్ పేర్కొంది.
Tags : 1