పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు
Breaking News
'బాయిలోనే బల్లిపలికే' ఫుల్ సాంగ్ వచ్చేసింది
Published on Sat, 11/22/2025 - 14:04
జానపద ప్రముఖ సింగర్ మంగ్లీ (Mangli) పాడిన కొత్త పాట ‘బాయిలోనే బల్లి పలికే’ నెట్టింట్ వైరల్ అవుతుంది. వారం క్రితం ప్రోమో విడుదల కాగా.. ఇప్పుడు ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు. మంగ్లీ, నాగవ్వల కాంబినేషన్‌లో వచ్చిన ఈ పాట్ సోషల్‌మీడియాను షేక్ చేస్తుంది. కమల్ ఎస్లావత్ సాహిత్యానికి సురేష్ బోబ్బిలి సంగీతం అదిరిపోయింది. బాయిలోనే బల్లి పలికే అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే మిలియన్ల కొద్ది రీల్స్ వచ్చేశాయి. ఇన్‌స్టా ఆన్ చేస్తే చాలు ఇదే సాంగ్ ఊపేస్తుంది. ఈ మధ్యకాలంలో జానపద పాటలు భారీగా వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల క్రితం రాను బొంబాయికి అనే పాటతో రాము రాథోడ్ ఏకంగా బిగ్‌బాస్ ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు మంగ్లీ పాడిన సాంగ్ కూడా ప్రేక్షకులను భారీగానే మెప్పిస్తుంది. మిలియన్ల కొద్ది వ్యూస్ రావచ్చని ఆమె అభిమానులు చెప్పుకొస్తున్నారు.
Tags : 1