Breaking News

సీరియల్‌ నటి ఎంగేజ్‌మెంట్‌.. అంతా కలలా ఉంది!

Published on Sat, 11/22/2025 - 13:51

బుల్లితెర నటి ఆద్య పరుచూరి (Aadhya Paruchuri) పెళ్లిపీటలెక్కనుంది. ప్రియుడు పృథ్వీ వేలు పట్టుకుని ఏడడుగులు వేయనుంది. బెస్ట్‌ ఫ్రెండే భర్తగా మారనున్నాడంటూ.. తన ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మడియాలో పలు ఫోటోలు షేర్‌ చేసింది.

అంతా ఒక కలలా..
'నా బెస్ట్‌ ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఇదంతా ఒక కలలా ఉంది. దీన్నుంచి బయటకు రాబుద్ధి కావడం లేదు. మేమిద్దరం కలిసి పెరిగాం.. కలిసి నవ్వుకున్నాం. ఇప్పుడు కలిసి భవిష్యత్తును నిర్మించుకోబోతున్నాం. జంటగా అడుగులు వేయబోతున్నాం' అంటూ ఈ జంట అందమైన క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిన అభిమానులు బుల్లితెర నటికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

గతంలో చెల్లి పెళ్లి.. ఇన్నాళ్లకు అక్కకి..
నిశ్చితార్థపు వేడుకలో ఒకరి వేలికి మరొకరు ఉంగరం తొడిగారు. జంటగా కేక్‌ కట్‌ చేశారు. ఆద్య విషయానికి వస్తే.. కృష్ణ తులసి, ఆ ఒక్కటి అడక్కు, ఉప్పెన, దేవతలారా దీవించండి వంటి పలు సీరియల్స్‌లో నటించింది. శ్రీమతి శ్రీనివాస్‌ ధారావాహికలోనూ యాక్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. నటి చెల్లికి మూడున్నరేండ్ల కిందట పెళ్లవగా.. ఇన్నాళ్లకు అక్క పెళ్లి పీటలెక్కింది.

 

 

చదవండి: ఓటీటీ థ్రిల్లర్‌ మూవీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)