Breaking News

ఈ సినిమా హిట్టయితేనే పిశాచి 2 రిలీజ్‌!

Published on Sat, 11/22/2025 - 08:24

దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది నటి ఆండ్రియా (Andrea Jeremiah). ఈమె మంచి గాయని అన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ రచయితగా, నిర్మాతగా మారింది. ఈమె కథను అందించి ది షో మస్ట్‌ గో ఆన్‌ పతాకంపై నిర్మించిన చిత్రం మాస్క్‌. బ్లాక్‌ మెడ్రాస్‌ ఫిలింస్‌ సంస్థతో కలిసి ఆండ్రియా ఈ చిత్రాన్ని నిర్మించింది. రుహాని శర్మ హీరోయిన్‌గా నటించిన ఇందులో ఛార్లీ, రమేష్‌ తిలక్‌, కల్లూరి వినో, రెడిన్‌ కింగ్‌స్లీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. 

మాస్క్‌ రిలీజ్‌
వెట్రిమారన్‌ మార్గదర్శకత్వంలో వికర్ణన్‌ అశోక్‌ అనే యువ దర్శకుడు తెరకెక్కించాడు. జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని, ఆర్‌డీ.రాజశేఖర్‌ ఛాయాగ్రహణం అందించారు. ఆండ్రియా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర పోషించగా హీరో కెవిన్‌ కథానాయకుడిగా నటించారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని శుక్రవారం (నవంబర్‌ 21న) తెరపైకి వచ్చింది. 

అది హిట్టయితేనే..
ఈ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆండ్రియా.. మాస్క్‌ మూవీ విజయంపై చాలా ఆశలే పెట్టుకుంది. కాగా ఈమె నటించిన మరో చిత్రం పిశాచి 2. మిష్కిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని చాలా కాలం అయ్యింది. అయితే కొన్ని ఆర్థికపరమైన సమస్యల కారణంగా విడుదల కాలేదు. ఆ చిత్రం గురించి నటి ఆండ్రియా వద్ద ప్రస్తావించగా.. తాను నిర్మించిన మాస్క్‌ మంచి విజయాన్ని సాధిస్తే ఆ తరువాత పిశాచి 2 చిత్రాన్ని తానే విడుదల చేస్తానంది. దీంతో మాస్క్‌ చిత్ర హిట్‌పై పిశాచి 2 చిత్ర విడుదల ఆధారడిందన్నమాట!

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)