ఇన్‌ఫ్రా, ఇంధన రంగ నిపుణులతో ఆర్థిక మంత్రి భేటీ 

Published on Sat, 11/22/2025 - 04:16

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం ఢిల్లీలో మౌలిక రంగం, ఇంధన రంగాలకు చెందిన నిపుణులతో భేటీ అయ్యారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2026–27) బడ్జెట్‌పై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆఫ్కాన్స్‌ ఎండీ ఎస్‌.పరమశివన్, షాపూర్జీ పల్లోంజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ క్యాపిటల్‌ డైరెక్టర్‌ మనీష్‌ త్రిపాఠి, జీఎంఆర్‌ గ్రూప్‌ డిప్యూటీ ఎండీ కె.నారాయణరావు, జేఎం బక్సి గ్రూప్‌ డైరెక్టర్‌ సందీప్‌ వాద్వా, ఇన్‌ఫ్రా విజన్‌ ఫౌండేషన్‌ సీఈవో జగదన్‌షా తదితర కంపెనీల సారథులు ఇందులో పాల్గొన్నారు. 

దీనిపై కేంద్ర ఆర్థిక శాఖ ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌పై ఒక పోస్ట్‌ పెట్టింది. ‘‘ఆర్థిక, కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ మంత్రి సీతారామన్‌ రానున్న 2026–27 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించి 11వ ముందస్తు సమావేశాన్ని ఇన్‌ఫ్రా, ఇంధన రంగాల నిపుణులతో నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్‌ శాఖ, షిప్పింగ్‌ శాఖల కార్యదర్శులు, రైల్వే బోర్డ్‌ చైర్మన్, కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు హాజరయ్యారు’’అని ఆర్థిక శాఖ తన పోస్ట్‌లో వెల్లడించింది. 

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌  2026–27 బడ్జెట్‌ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అంతర్జాతీయంగా వాణిజ్య అనిశి్చతుల నేపథ్యంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు ప్రాధాన్యం నెలకొంది. డిమాండ్, ఉపాధి కల్పనను పెంచడం, దేశ జీడీపీని 8 శాతం వృద్ధి రేటుకు చేర్చడం వంటి ప్రధాన సవాళ్లు ఆర్థిక మంత్రి ముందున్నాయి. వ్యవసాయం, ఎంఎస్‌ంఎఈలు, ఆరోగ్య సంరక్షణ, క్యాపిటల్‌ మార్కెట్‌ రంగాల ప్రతినిధులు, ప్రముఖ ఆర్థికవేత్తలతో ఇప్పటి వరకు బడ్జెట్‌ ముందస్తు సమావేశాలు నిర్వహించడం గమనార్హం.   

Videos

Gankala Kavitha: పార్టీ ఏదైనా వైఎస్ జగన్ చేసిన మంచి చెప్పాల్సిందే

విద్యావ్యవస్థలో చాలా సమస్యలు ఉన్నాయి: హరీశ్ రావు

మ్యాథ్స్ టీచర్ వేధింపులు ప్రిన్సిపాల్ కాళ్లపై పడిన విద్యార్థినులు

జగన్ హైదరాబాద్ పర్యటన పై ఎల్లో మీడియా చిల్లర డిబేట్లు... ఏకిపారేసిన కాకాణి

RK: సొంత జిల్లా మామిడి రైతులను మోసం చేస్తున్న చంద్రబాబు

లిక్కర్ స్కాంలో తన ప్రమేయం లేదన్న చెవిరెడ్డి

Venugopala : నీ సవాలు నేను సిద్ధం.. విశాఖ YSRCP లీడర్స్ సంచలన కామెంట్స్

Sridhar Babu: ఎన్నిసార్లు విఫలమైన బీఆర్ఎస్ బుద్ధిమాత్రం మారడం లేదు

Dubai: కుప్పకూలిన భారత ఫైటర్ జెట్ విమానం

సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

Photos

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 21-28)

+5

తెర వెనక ఇంత హంగామా నడిచిందా? (ఫొటోలు)

+5

లేడీ క్రికెటర్ స్మృతి మంధాన హల్దీ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

బయటకొచ్చిన శ్రీముఖి CID చేతికి బ్యాంక్ స్టేట్ మెంట్

+5

అలనాటి హీరోయిన్ రాధ కూతురు.. పెళ్లయి రెండేళ్లయిపోయిందా? (ఫొటోలు)

+5

దాగుడుమూతలు ఆడుతున్న హీరోయిన్‌ తమన్నా (ఫోటోలు)

+5

కవ్వించే చూపులతో శ్రీలీల.. వైరల్‌ ఫోటోలు