Breaking News

స్వతంత్ర సినిమాకు ప్రోత్సాహం కరువైంది: ‘ఇఫీ’లో కమల్‌హాసన్‌

Published on Sat, 11/22/2025 - 01:18

‘‘స్వతంత్ర సినిమా స్వతంత్రంగానే ఉంటుంది. దాన్ని వాణిజ్య సినిమాలతో  పోల్చి పరిమితుల్లో పెట్టకండి. స్వతంత్ర సినిమా కూడా స్వతంత్ర భారత్‌ లాగే స్వేచ్ఛగా ఉంటుంది’’ అని నటుడు–దర్శక–నిర్మాత కమల్‌హాసన్‌ తెలిపారు. గోవాలో జరుగుతున్న 56వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో (ఇఫీ) శుక్రవారం కమల్‌హాసన్‌ పాల్గొన్నారు. ‘ఇండిపెండెంట్‌ సినిమాలు ఇంకా థియేటర్లలో స్థానం సంపాదించుకోవడానికి  పోరాడుతున్నాయి... థియేటర్లలో స్వతంత్ర సినిమాలకు సరైన ప్రదర్శన అవకాశాలు లభించడం లేదు కదా?’ అనే ప్రశ్నకు కమల్‌హాసన్‌ బదులిస్తూ– ‘‘అవును... ఇది నిజమే. గత 40 ఏళ్లుగా నేను లేవనెత్తుతున్న సమస్య ఇది’’ అని స్పష్టం చేశారు.

శివ కార్తికేయన్, సాయి పల్లవి జోడీగా కమల్‌హాసన్‌ నిర్మించిన ‘అమరన్‌’ చిత్రం ఈ ఏడాది భారతీయ పనోరమా విభాగంలో ప్రారంభ చిత్రంగా ఎంపిక అయింది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రత్యేకంగా అభినందించిన అనంతరం కమల్‌హాసన్‌ మాట్లాడుతూ– ‘‘నేను నిర్మించిన ‘అమరన్‌ ’ చిత్రం ‘ఇఫీ’లో ప్రదర్శనకు ఎంపిక కావడం, అత్యున్నత పురస్కారం అయిన గోల్డెన్‌ పీకాక్‌కు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు. ‘అర్ధంతరంగా ఆగి పోయిన ‘మరుదనాయగమ్‌’ ప్రాజెక్ట్‌ను తిరిగి ప్రారంభించే చాన్స్‌ ఉందా?’ అనే ప్రశ్నకు కమల్‌ బదులిస్తూ– ‘‘ప్రస్తుత సాంకేతిక విప్లవ యుగంలో ఉన్న అవకాశాల దృష్ట్యా ఆ చిత్రం పూర్తి కావచ్చుననే ఆశాభావం ఉంది’’ అన్నారు.  

మాస్టర్‌ క్లాసెస్‌ ప్రారంభం 
‘ఇఫీ’లో భాగంగా నిర్వహిస్తున్న మాస్టర్‌క్లాస్‌ సిరీస్‌ను శుక్రవారం కేంద్ర సమాచార– ప్రసారశాఖ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డా. ఎల్‌. మురుగన్‌ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు ముజఫర్‌ అలీ మాస్టర్‌క్లాస్‌ సిరీస్‌లో తొలి సెషన్‌ను నిర్వహించారు.  

సినీ ప్రముఖులతో క్లాసెస్‌... 
ఈ మాస్టర్‌క్లాస్‌ విభాగంలో ఫ్యానల్‌ డిస్కషన్లు, వర్క్‌షాపులు, రౌండ్‌టేబుల్‌ ఇంటరాక్షన్లు, ఇంటర్వ్యూ సెషన్లు, ఫైర్‌సైడ్‌ చాట్స్‌ వంటి వర్క్‌షాపులు ఉంటాయి. భారతీయ సినీ ప్రముఖులు విధు వినోద్‌ చోప్రా, అనుపమ్‌ ఖేర్, షాద్‌ అలీ, శేఖర్‌ కపూర్, రాజ్‌కుమార్‌ హిరానీ, ఆమిర్‌ ఖాన్, విశాల్‌ భరద్వాజ్, సుహాసినీ మణిరత్నం వంటి వారు ఈ ఫెస్టివల్‌లో వివిధ సెషన్లు నిర్వహించనున్నారు. ప్రత్యేకంగా కృత్రిమ మేథ  (ఏఐ) మనుగడ, సినిమాటోగ్రఫీ, వీఎఫ్‌ఎక్స్, ఎస్‌ఎఫ్‌ఎక్స్‌ వంటి సాంకేతిక విభాగాలపై ప్రత్యేక వర్క్‌షాపులను ప్లాన్‌ చేశారు. రంగస్థల నటనపై ప్రముఖ నిపుణులు అందించే మాస్టర్‌క్లాస్‌లు కూడా జరగనున్నాయి. – గోవా నుంచి ‘సాక్షి’ ప్రతినిధి

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)