Breaking News

పేదింటమ్మ పెద్ద మనసు

Published on Fri, 11/21/2025 - 00:55

‘ధనానికి పేదను కావచ్చుగానీ గుణానికి కాదు’ అన్నట్లుగా ఉంటుంది కొందరి ధోరణి. వారి గుణంలోనే దానగుణం ఉంటుంది. అలాంటి ఒక మహిళ ఆత్రం లేతుబాయి.
ఆదిలాబాద్‌ జిల్లా సాత్నాల మండలం సహేజ్‌ గ్రామానికి చెందిన లేతుబాయి తనకు ఉన్న మూడెకరాల స్థలంలో ఒక ఎకరం స్థలాన్ని పది కోలాం కుటుంబాలు ఇళ్లు కట్టుకోడానికి ప్రభుత్వానికి దానంగా ఇచ్చింది...

ఆత్రం లేతుబాయి... అడవులను, చెట్టుపుట్టలనూ నమ్ముకొని జీవిస్తోంది. వ్యవసాయమే జీవనాధారంగా అతిసాధారణ జీవితాన్ని గడుపుతోంది. బాహ్య ప్రపంచం, ఆధునిక పోకడలు అస్సలు తెలియని అలాంటి మహిళపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కారణం... దుబ్బగూడ గ్రామంలో పది కొలాం కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయి. స్థలం లేకపోయినప్పటికీ ప్రత్యేక నిబంధనలతో ప్రభుత్వం ఇండ్లు మంజూరు చేసింది. మంజూరైతే చేశారు గానీ ఆ ఇండ్లను కట్టేందుకు స్థలం అందుబాటులో లేదు. ఈ పరిస్థితుల్లో ఆత్రం లేతుబాయి తన భర్త జంగు, ముగ్గురు కుమారులతో చర్చించింది. తన పేరిట ఉన్న మూడెకరాల నుంచి ఒక ఎకరం ప్రభుత్వానికి అందజేసింది.

లేతుబాయి గతంలో కూడా ఇలానే తమ బంధువులు కొంతమందికి పూరిగుడిసెలు వేసుకునేందుకు చోటు కల్పించింది.  ‘మా కొలాం కుటుంబాలు ఎన్నో ఏళ్లుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాయి. పక్కా ఇల్లు అనేది మాకు కల లాంటిది. అది నిజమైతే మా జీవితాలు మారుతాయి. అందుకే మాకు ఉన్న మూడు ఎకరాల్లో ఒక ఎకరం ఇచ్చాను’ అంటుంది 56 సంవత్సరాల లేతుబాయి. ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా లేతుబాయి–జంగు దంపతులను ఘనంగా సన్మానించారు. లేతుబాయి నిర్ణయం ఎందరికో స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.
       
– గొడిసెల కృష్ణకాంత్, సాక్షి, ఆదిలాబాద్, 
ఫొటోలు: చింతల అరుణ్‌ రెడ్డి

Videos

పాకిస్థాన్ కు డిజిటల్ షాక్... హ్యాక్ అవుతున్న ప్రభుత్వ వెబ్ సైట్లు

Varudu: అయ్యో..ఏపీకి చివరి ర్యాంక్..! పోలీసుల పరువు తీసిన అనిత

తెలంగాణ DGP ముందు లొంగిపోనున్న మావోయిస్టు అగ్రనేతలు

జమ్మలమడుగులో ఎవరికి టికెట్ ఇచ్చినా YSRCPని గెలిపిస్తాం: సుధీర్రెడ్డి

టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి కాకాణి సవాల్

Baba Vanga: మరి కొన్ని రోజుల్లో మరో తీవ్ర సౌర తుఫాను

మావోయిస్టు నేత హిడ్మా ఎన్ కౌంటర్ తరువాత బాడ్సె దేవాపై పోలీసుల ఫోకస్

Chittoor: ATM నగదు చోరీ కేసు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఏపీ నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా

తెలంగాణ పంచాయతీరాజ్ జీవో విడుదల

Photos

+5

ప్రీమియర్ నైట్.. అందంగా ముస్తాబైన రాశీ ఖన్నా (ఫొటోలు)

+5

తెలుగు యాక్టర్స్ జోడీ మాలధారణ.. పుణ్యక్షేత్రాల సందర్శన (ఫొటోలు)

+5

‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ HD మూవీ స్టిల్స్

+5

హైదరాబాద్ లో శబరిమల అయ్యప్ప ఆలయం..ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్‌ రాంబాయి’ చిత్రం సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

తెలంగాణ బిడ్డగా మెప్పించిన గోదావరి అమ్మాయి (ఫోటోలు)

+5

బాలయ్య ‘అఖండ-2 ’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

హైటెక్స్ లో 'తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్' చిత్రోత్సవం (ఫొటోలు)

+5

వైభవంగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)