Breaking News

400 రోజుల్లో 50,000 యూనిట్ల అమ్మకాలు

Published on Wed, 11/19/2025 - 18:02

కార్ల తయారీ కంపెనీ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఎలక్ట్రిక్ క్రాస్ఓవర్ యూటిలిటీ వెహికల్ (CUV) ఎంజీ విండ్సర్ అమ్మకాలు కీలక మైలురాయి చేరుకున్నట్లు ప్రకటించింది. కేవలం 400 రోజుల్లోనే 50,000 యూనిట్ల అమ్మకాలు పూర్తి చేసుకున్నట్లు ప్రకటించింది. గణాంకాల ప్రకారం ప్రతి గంటకు సగటున 5 యూనిట్ల ఎంజీ విండ్సర్ కార్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఇది కంపెనీకి చారిత్రక విజయాన్ని సూచించడమే కాకుండా, భారతదేశంలో ఈవీ విభాగంలో అత్యంత వేగంగా ఈ మార్కును చేరుకున్న మొదటి ఈవీగా విండ్సర్‌ నిలిచిందని కంపెనీ తెలిపింది.

ఈ సందర్భంగా జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ..‘విండ్సర్ ఈవీని ప్రారంభించినప్పుడు వినియోగదారులకు స్టైలిష్, విలువ ఆధారిత మొబిలిటీ సొల్యూషన్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. విండ్సర్ ఈవీ వేగంగా విజయం సాధించింది. రికార్డు సమయంలో 50,000 అమ్మకాలను చేరింది. ఈ విజయం న్యూ ఎనర్జీ వాహనాల పట్ల కంపెనీ నిబద్ధతను మరింతగా పెంచుకోవడానికి శక్తినిస్తుంది’ అన్నారు. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా తయారు చేసిన పరిమిత ఎడిషన్ సిరీస్ ఎంజీ విండ్సర్ ఇన్‌స్పైర్‌ను ఇటీవల భారత రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ ఆవిష్కరించినట్లు గుర్తు చేశారు.

ఎంజీ విండ్సర్ ఫీచర్లు

ఈ కారు 100 KW శక్తిని 200 ఎన్‌ఎం టార్క్‌ను అందిస్తుంది. దీని ప్రారంభ BaaS (బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్) ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఫ్యూచరిస్టిక్ ఏరోగ్లైడ్ డిజైన్‌తో పాటు 135 డిగ్రీల వరకు వాలే ఏరో లాంజ్ సీట్లు ఉన్నాయి.

ఇదీ చదవండి: డ్రైవర్‌ జీతం రూ.53,350.. త్వరలో రూ.1 లక్ష!

Videos

అంబేద్కర్ స్మృతివనం పట్ల నిర్లక్ష్యం బాబుపై హైకోర్టు ఆగ్రహం

జగన్ కోసం తండోపతండాలుగా జనాలు... ABN, TV5 థంబ్ నైల్స్ పై అంబటి మాస్ ర్యాగింగ్

Hyd: స్టేట్ ఏదైనా తగ్గని జగన్ క్రేజ్

జలుబు, దగ్గు, గొంతు నొప్పికి యాంటీబయాటిక్స్ వేసుకుంటున్నారా?

Tripura: పికప్ వ్యాన్‌ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

రాజమౌళి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్న ధార్మిక సంఘాలు

Devabhaktuni: ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు వస్తుంటే చంద్రబాబు నిద్రపోతున్నారా..

ఎల్లో మీడియా విషపు రాతలు... ఇచ్చిపడేసిన జూపూడి

Corporator Sravan: చెరువులో దూకి కార్పొరేటర్‌ ఆత్మహత్యాయత్నం

Raja Singh: నీ లాంటి ఫాల్తూ డైరెక్టర్ ని ! జైల్లో వేసి..!!

Photos

+5

గ్రాండ్‌గా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా.. హాజరైన సినీతారలు (ఫోటోలు)

+5

భర్తతో కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తోన్న అమలాపాల్ (ఫోటోలు)

+5

సిస్టర్‌ శిల్పా శిరోద్కర్ బర్త్‌డే.. చెల్లిపై నమ్రతా ప్రశంసలు (ఫోటోలు)

+5

రివాల్వర్ రీటా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. (ఫోటోలు)

+5

వెకేషన్‌ ఎంజాయ్ చేస్తోన్న సాయి పల్లవి సిస్టర్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్‌కు జగన్‌.. పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రీ రిలీజ్ (ఫొటోలు)

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)