గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
పదేళ్ల తర్వాత నా లైఫ్ మారబోతుంది : అఖిల్
Published on Wed, 11/19/2025 - 13:21
‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో పదేళ్లుగా ఉంటున్న నాకు సరైన బ్రేక్ రాలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నా. ఈ సినిమా రిలీజైన రోజు నుంచి నా జీవితం మారిపోతుందనే నమ్మకం ఉంది. ఈ చిత్రంలో నేను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుంది’’ అని హీరో అఖిల్ రాజ్(Akhil Raj) చెప్పారు.
సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ ఉడ్డెమారి, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. డా. నాగేశ్వరరావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. ఈ చిత్రాన్ని నిర్మాతలు వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ నెల 21న విడుదల చేస్తున్నారు.
తేజస్విని మాట్లాడుతూ– ‘‘రాంబాయి క్యారెక్టర్‌కు నేను సరిపోతానని ఎంపిక చేశారు. తెలంగాణ యాసలో మాట్లాడేందుకు సాయిలుగారు సపోర్ట్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు నేను భావోద్వేగానికి గురయ్యా.ఈ చిత్రాన్ని 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్ వంటి కల్ట్ మూవీస్ తో పోల్చుకోవచ్చు.
ఆ చిత్రాల్లాగే మా సినిమా కూడా కల్ట్ మూవీగా పేరు తెచ్చుకుంటుంది. ఈ నెల 21న మా మూవీ చూసి థియేటర్స్ నుంచి బయటకు వచ్చిన ఆడియెన్స్ కూడా మేము ఇలా ఎందుకు చెబుతున్నామో అర్థం చేసుకుంటారు. రియలిస్టిక్ ఇన్సిడెంట్ ఆధారంగా సినిమా రూపొందించినా కొంత సినిమాటిక్ లిబర్టీ కూడా మూవీలో ఉంటుంది’ అన్నారు.
Tags : 1