ఐదు రోజుల్లో రూ. 5వేలు!.. బంగారం ధరల్లో భారీ మార్పు

Published on Tue, 11/18/2025 - 17:39

అమెరికా డాలర్ బలపడటం, వచ్చే నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును తగ్గిస్తుందనే ఆశలు సన్నగిల్లడం వంటి కారణాల వల్ల ప్రపంచ మార్కెట్లలో.. మంగళవారం బంగారం ధరలు పడిపోయాయి.

భారతదేశంలో నేడు (మంగళవారం) 24 క్యారెట్ల బంగారం ధర రూ. 123660 (10 గ్రామ్స్), 22 క్యారెట్ల ధర రూ. 1,13,350 వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే.. ఈ రోజు ధరలు వరుసగా రూ. 1740 & రూ. 1600 తక్కువ. పసిడి ధరలు ఇంకా తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

నవంబర్ 13న రూ. 1,28,620 లక్షల వద్ద ఉన్న 24 క్యారెట్ల బంగారం ధర.. ఈ రోజు (నవంబర్ 18) రూ. 1,23,660 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. కేవలం ఐదు రోజుల్లో రూ. 4960 తగ్గిందని తెలుస్తోంది. అంటే ఐదు రోజుల్లో దాదాపు 5000 రూపాయలు తగ్గిందన్నమాట.

వెండి విషయానికి వస్తే.. రూ. 1.83 లక్షల (నవంబర్ 13) వద్ద ఉన్న సిల్వర్ రేటు.. నేటికి రూ. 1.70 లక్షలకు చేరింది. అంటే వెండి రేటు కూడా ఐదు రోజుల్లో రూ. 13వేలు తగ్గిందన్నమాట.

అమెరికా డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, ఫెడ్‌ వడ్డీ రేట్లు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయి. ఫెడ్ వడ్డీ రేటు పెరిగినప్పుడు.. గోల్డ్ రేటు తగ్గుతుంది. ఫెడ్ వడ్డీ రేటు తగ్గినప్పుడు.. పసిడి ధరలు పెరుగుతాయి. బంగారం ధరలు పెరుగుదల, తగ్గుదలల మీద.. రాజకీయ, భౌగోళిక కారణాలు.. ఆర్ధిక వ్యవస్థలు ప్రభావం చూపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Videos

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు

తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్

iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్

ఇవాళ బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం..

అయ్యప్ప భక్తులకు కొత్త రూల్స్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)