ది బెస్ట్‌ చికెన్‌ వంటకంగా బటర్‌ చికెన్‌..!

Published on Tue, 11/18/2025 - 15:44

ప్రముఖ ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ టేస్ట్‌ అట్లాస్‌ తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమమైన చికెన్‌ వంటకాల జాబితాను ఆవిష్కరించింది. దక్షిణ కొరియా, ఫ్రాన్స్‌ చికెన్‌ రెసిపీలు కూడా ఈ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. అయితే ఈ జాబితాలో అగ్రస్థానంలో పిలిక్ టాప్కాపి రెసిపీ ఉంది. ఇది చికెన్‌ తొడ వద్ద ఉండే బోన్‌లెస్‌ ముక్కలతో చేసే వంటకం. దీన్ని ఎండుద్రాక్ష, ఉల్లిపాయలు, సుగంధ ద్రవ్యాల మిశ్రమంతో తయారు చేస్తారు. 

ఆ తర్వాతి స్థానంలో మొరాకోకు చెందిన రిఫిస్సా ఉంది. ఇది ఉడికించిన ఉల్లిపాయలు, కాయధాన్యాలతో తయారు చేసే సాంప్రదాయ వంటకం. ఇది తేలికపాటి తీపితో కూడిన రుచిని అందిస్తుంది. తదుపరి మూడవ స్థానంలో ఫ్రైడ్ చికెన్, నాల్గవ స్థానంలో రోస్ట్‌ చికెన్‌లు ఉన్నాయి.  టాప్‌ 5లో ఇండియాకు చెందిన బటర్‌ చికెన్ చోటు దక్కించుకోవడం విశేషం. 

ఇది ఎలా తయారు చేస్తారంటే.. రోస్ట్‌ చేసిన చికెన్‌ ముక్కలకు పుష్కలంగా మసాల దినుసులు జోడించి, క్రీమ్‌, టమోటాలు, వెన్నతో మంచి గ్రేవీ రూపంలో చేసే బటర్‌ చికెన్‌ ఇది.  అంతేగాదు దీంతోపాటు మరికొన్ని ఇతర భారతీయ చికెన్‌ వంటకాలు కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం విశేషం. 

అవేంటంటే..

తందూరీ చికెన్ (ర్యాంక్ 14)

చికెన్ టిక్కా (ర్యాంక్ 35)

చికెన్ 65 (ర్యాంక్ 38)

చికెన్ రెజాలా (ర్యాంక్ 51)

చికెన్ కాథి రోల్ (ర్యాంక్ 74)

టేస్ట్ అట్లాస్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 చికెన్ వంటకాలు ఇవే:

పిలిక్ టాప్కాపి (టర్కియే)

రిఫిస్సా (మొరాకో)

కొరియన్ ఫ్రైడ్ చికెన్ (దక్షిణ కొరియా)

పెరువియన్ రోస్ట్ చికెన్ (పెరూ)

బటర్ చికెన్ (ఇండియా)

కరాగే (జపాన్)

ఫ్రెంచ్ రోస్ట్ చికెన్ (ఫ్రాన్స్)

డాక్ గల్బి (దక్షిణ కొరియా)

చికెన్ కరాహి (పాకిస్తాన్)

ఇనాసల్ నా మనోక్ (ఫిలిప్పీన్స్)

(చదవండి: షేక్‌ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..! ఆ కారణంతోనే ఆమె..)

Videos

గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే

ఇవ్వాల్సింది 40K.. ఇచ్చింది 10K.. రైతును ముంచేసిన చంద్రబాబు

నిద్రలేచిన అగ్నిపర్వతం.. ఆ దేశం తగలపడుతుందా?

అన్మోల్ బిష్ణోయ్ అరెస్ట్.. కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్

త్వరగా అరెస్ట్ చేయండంటూ పోలీసులకు ఫోన్ ల మీద ఫోన్ లు.. వెంకట్ రెడ్డి సంచలన నిజాలు

తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్

iBomma రవి చేసింది పైరసీ కాదు? సినిమా ఇండస్ట్రీ వాళ్లే పెద్ద క్రిమినల్స్

ఇవాళ బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణం..

అయ్యప్ప భక్తులకు కొత్త రూల్స్.. కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు

తిక్క కుదిరిందా..! ఇకనైనా మారు బాబు

Photos

+5

విశాఖ : కన్నుల పండుగగా అనంత పద్మనాభుని దీపోత్సవం (ఫొటోలు)

+5

నాగ‌దుర్గ‌ హీరోయిన్‌గా తొలి చిత్రం..‘కలివి వనం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

పుట్టపర్తిలో సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు (ఫొటోలు)

+5

తెలుసు కదా మూవీ సెట్‌లో సరదా సరదాగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి (ఫోటోలు)

+5

శ్రీశైలంలో సురేఖవాణి కూతురు సుప్రీత ప్రత్యేక పూజలు (ఫోటోలు)

+5

సినిమా పైరసీపై ఫిల్మ్‌ ఛాంబర్‌ మహా ధర్నా (ఫోటోలు)

+5

జీన్స్ డ్రెస్సులో మెరుస్తున్న అక్కినేని కోడలు శోభిత (ఫోటోలు)

+5

ప్రెగ్నెన్సీతో బిగ్‌బాస్ సోనియా.. లేటేస్ట్‌ బేబీ బంప్‌ ఫోటోలు చూశారా?

+5

ముత్యపు పందిరి వాహ‌నంపై అమ్మవారు

+5

“సంతాన ప్రాప్తిరస్తు” మూవీ సక్సెస్ మీట్ (ఫోటోలు)