మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలకు చెల్లుబోయిన అదిరిపోయే కౌంటర్
Breaking News
అయ్యప్ప నామస్మరణతో మార్మోగిపోయిన శబరిమల..! తొలిరోజే మెగా రికార్డు..
Published on Tue, 11/18/2025 - 10:44
కేరళలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. మొన్న(ఆదివారం) సాయంత్రం నుంచే దర్శనాలు ప్రారంభం కావడంతో వేల సంఖ్యలో భక్తలు తరలివస్తున్నారు. కిలోమీటర్ల వరకు క్యూ లైన్ ఉండటంతో దర్శనానికి పదిహేను గంటల సమయం పడుతోంది. అయితే సరైన సౌకర్యాలు లేక భక్తులు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం.
41 రోజుల పాటు సాగే మండల పూజ కోసం..
ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku)మండల పూజ) ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమై.. డిసెంబర్27న ముగియనుంది. ఆ నేపేథ్యంలోనే శబరిమల భక్తులతో కిటకిటలాడింది. తొలిరోజే భక్తజన సందోహం మెగా రికార్డు(1 లక్ష 25 వేలమందికి) రేంజ్‌లో అయ్యప్ప దర్శనానికి తరలివచ్చారు.
అదీగాక ప్రస్తుతం 22 లక్షల మందికి పైగా భక్తులు అయ్యప్ప దర్శనం కోసం వర్చువల్‌గా బుక్ చేసుకున్నట్లు అధికారిక వర్గాల సమాచారం. ఈ సందర్భంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది కూడా.
కాగా, మండల సీజన్ కోసం ఆదివారం శబరిమల ఆలయం తిరిగి తెరుచుకోగా.. సోమవారం ఉదయం నుంచి నెయ్యాభిషేకాలు మొదలయ్యాయి. దీంతో.. ముర్ము ఇరుముడిలోని ముద్ర టెంకాయలోని నేతితో తొలుత అయ్యప్పకు అభిషేకం చేశారు. అలా.. మండల సీజన్‌లో తొలి నెయ్యాభిషేకం రాష్ట్రపతి ముర్ము చేయించినట్లయిందని టీడీబీ పేర్కొంది.
(చదవండి: శబరిమలలో భారీ వర్షాలు..అయ్యప్ప భక్తులకు అలర్ట్!)
Tags : 1