ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
నాలుగేళ్ల తర్వాత తండ్రైన సింగర్.. ఆలస్యంగా రివీల్!
Published on Mon, 11/17/2025 - 16:42
ప్రముఖ బాలీవుడ్ సింగర్ అఖిల్ సచ్‌దేవా తండ్రిగా ప్రమోషన్ పొందారు. పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ విషయాన్ని కాస్తా ఆలస్యంగా రివీల్ చేశారు. ఈ నెల ఆరో తేదీన తన భార్య బిడ్డకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో పంచుకున్నారు. మా కూతురి రూపంలో మా అమ్మ తిరిగొచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు ఈ జంటకు అభినందనలు చెబుతున్నారు.
కాగా.. సింగర్ అఖిల్ సచ్‌దేవా.. బాలీవుడ్‌లో సన్ మేరే హమ్ సఫర్, తేరా బన్ జౌంగా, చన్నా వే వంటి పాటలతో ఫేమ్ తెచ్చుకున్నారు.
వీరిద్దరు డిసెంబర్ 7 2020న జైపూర్‌లోని సమోదే హవేలీలో తాన్యా గుల్లా, అఖిల్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. దాదాపు ఐదారేళ్ల పాటు డేటింగ్ ఉన్న ఈ జంట పెళ్లి జీవితం ప్రారంభించారు. ఆరేళ్ల క్రిత నా కచేరీకి వచ్చిన తాన్య మొదటి చూపులోనే నచ్చేయడంతో అలా మా పరిచయం మొదలైందని గతంలో సింగర్ వెల్లడించారు.
Tags : 1