Breaking News

అయ్యప్ప భక్తులకు అలర్ట్‌..! శబరిమలలో మళ్లీ..

Published on Mon, 11/17/2025 - 15:55

సాక్షి, తిరువనంతపురం: శబరిమలలో ఇవాళ, రేపు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. కొట్టాయం, ఇడుక్కి, అలప్పుజా, పతనం తిట్ట, కొల్లాం, తిరువనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ శబరిమల యాత్ర ప్రాంతంతో సహా మొత్తం ఆరు ఇతర జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది.

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావమే ఈ భారీ వర్షాలకి కారణం అని వాతావరణ శాఖ తెలిపింది. అందువల్ల ఈ రోజు, రేపు శబరిమల సన్నిధానం, పంప, నీలక్కల్‌ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.  

ఆయా ప్రాంతల్లో తప్పనిసరిగా..

సన్నిధానం, పంబా, నీలక్కల్‌లలో ఇవాళ, రేపు  7 సెం.మీ నుంచి 11 సెం.మీ వరకు వర్షం పడే అవకాశం ఉంది

అలర్ట్ జారీ చేయబడిన జిల్లాల్లో 24 గంటల్లో 64.5 మిమీ నుంచి 115.5 మిమీ వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది.

అయ్యప్ప భక్తులకు భద్రతా సూచనలు

భారీ వర్ష హెచ్చరిక నేపథ్యంలో రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ యాత్రికులకు ప్రత్యేక హెచ్చరిక సూచనలు జారీ చేసింది.

కొండచరియలు విరిగిపడటం, బురదజల్లులు, పర్వత వరదలకు గురయ్యే ప్రాంతాలలో నివసించేవారు, అలాగే నదుల వెంబడి, ఆనకట్టల దిగువన నివసించేవారు అధికారుల సూచనల మేరకు వెంటనే సురక్షిత ప్రదేశాలకు తరలివెళ్లాలని విపత్తు నిర్వహణ అథారిటీ సూచించింది.

విపత్తు సంభవించే ప్రాంతాల్లో నివసించేవారు పగటిపూట సమీపంలోని సహాయ శిబిరాలకు తరలి వెళ్లాలి. వాటి సమాచారం కోసం ప్రజలు స్థానిక స్వపరిపాలన,  రెవెన్యూ అధికారులను సంప్రదించవచ్చు.

బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, భద్రత లేని ఇళ్లు లేదా బలహీనమైన పైకప్పులు ఉన్న ఇళ్లలో నివసించేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి.

వర్షపు రోజుల్లో అనవసరమైన ప్రయాణాలు, పర్వతారోహణను నివారించాలి.

శబరిమల దర్శనానికి వచ్చే భక్తులు వాతావరణ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. అలాగే భద్రతాధికారుల సూచనల మేరకు ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉందన స్పష్టం చేసింది కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ.

(చదవండి: శబరిమల సన్నిధానం వసతి సౌకర్యాల వివరాలు ఇవిగో..!)

 

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)