Breaking News

“లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్” చొరవతో సరస్సు పునరుద్ధరణ

Published on Mon, 11/17/2025 - 15:22

భారతదేశంలో అతిపెద్ద రిటైల్‌ రియల్‌ ఎస్టేట్‌ ఫ్లాట్‌ఫామ్‌ అయిన నెక్సస్‌ సెలెక్ట్‌ ట్రస్ట్‌ “లేక్స్ ఆఫ్ హ్యాపీనెస్” కార్యక్రమం కింద తన 10వ సరస్సుని పునరుద్ధరించింది. 2022లో ప్రారంభించిన ఈ చొరవ పర్యావరణ అనుకూలమైన కమ్యూనిటీ ఆధారిత పద్ధతులను ఉపయోగించి వచ్చే ఏడాది 2026 నాటికి దాదాపు 15 సరస్సులను పునరుద్ధరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 

ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ అంతటా దాదాపు 10 సర్సులను పునరుద్ధిరించింది. అందులో సుమారు వందకు పైగా గ్రామాల్లో దాదాపు లక్ష మందికి పైగా ప్రజలు లబ్ధి పొందారు. హైదరాబాద్‌లో మియాపూర్‌లోని 21 ఎకరాల గురునాథ్‌ చెరువు సరస్సు పూర్తిగా పునరుద్ధరించబడటమే కాకుండా వినోదం కోసం స్థానిక సమాజానికి అప్పగించారు జల సంరక్షణకారులు ఆనంద్ మల్లిగావాడ్, గున్వంత్ సోనావానేలు. 

సాంప్రదాయ పద్ధతులతోనే ఈ సరస్సులను పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే ప్రక్రియను సహజంగా ఉంచడానికి సిమెంట్‌, ఉక్కుని నివారించారు. ఈ విధానాల వల్ల కరువు ప్రభావిత ప్రాంతాల్లో భూగర్భ జల మట్టాలు 1.5 రెట్లు పెరిగాయి. సుమారు 20 ఎండిపోయిన బావులు తిరిగి నీటితో నింపబడ్డాయి, అలాగే వ్యవసాయ భూములు సైతం పునరుద్ధరించబడ్డాయి కూడా. 

పైగా వలస పక్షులు రాకతో జీవవైధ్యం మెరుగుపడింది. అంతేగాదు కుటుంబాలకు ఏడాది పొడవునా తాగునీటి సదుపాయం అందనుంది కూడా. ఈ మేరకు నెక్సస్‌ సీఈవో దలీప్‌ సెహగ్‌ ఈ సరస్సు పునరుజ్జీవింపబడటంతో, నీటిని తిరిగి పొందగలిగాం అన్నారు. ప్రతి సరస్సు కూడా సమాజానికి గుండె అని నెక్సస్‌ ప్రెసిడెంట్‌ జయేన్‌ నాయక్‌ అన్నారు. దీన్ని ఒక గొప్ప మైలు రాయిగా అభివర్ణించింది బిగ్‌ పిక్చర్‌.

(చదవండి: వాట్‌ హోమ్‌ మేనేజర్‌కు నెలకు రూ. 1 లక్ష..! సీఈవోలు ఇలానే..)



 

#

Tags : 1

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)