ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?
Breaking News
పుష్పను కాపీ కొట్టలేదు, దానితో పోల్చకండి: హీరో
Published on Mon, 11/17/2025 - 14:39
మలయాళ హీరో, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం "విలాయత్ బుద్ధ". ఈ సినిమాలో హీరో ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే 'డబుల్ మోహన్' పాత్రలో కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితమే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇది చూసిన ఎంతోమంది విలాయత్ బుద్ధ చిత్రాన్ని పుష్పతో పోలుస్తున్నారు. అల్లు అర్జున్ బ్లాక్‌బస్టర్ హిట్ మూవీ పుష్పను కాపీ కొట్టారని విమర్శిస్తున్నారు.
నవల ఆధారంగా..
దీనిపై పృథ్వీరాజ్ స్పందించాడు. పుష్ప రాకముందే ఈ సినిమా స్టార్ట్ చేశాం. జీఆర్ ఇందుగోపాలన్ రాసిన విలాయత్ బుద్ధ అనే నవల ఆధారంగా మా సినిమా తెరకెక్కింది. అయ్యప్పనుమ్ కోషియుమ్ డైరెక్టర్ సాచి ఫస్ట్ నాకు ఈ కథ చెప్పాడు. ఆయన 2020లో కన్నుమూయడంతో తన అసిస్టెంట్ జయన్ నంబియార్ దర్శకత్వ బాధ్యతల్ని భుజాన వేసుకున్నాడు.
పుష్ప కంటే ముందే..
అప్పటికి పుష్ప సినిమా రానేలేదు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా ఒక సినిమా వస్తోందన్న విషయం కూడా మాకు తెలీనే తెలీదు. మా సినిమా చిత్రీకరణ ముగింపుకు వచ్చే సమయానికి పుష్ప రెండు భాగాలు రిలీజై సంచలనం సృష్టించాయి. ఇక మా సినిమాలోని డబుల్ మీనన్ పాత్రకు పుష్పరాజ్ పాత్రకు ఎటువంటి సంబంధం లేదు అని పృథ్వీరాజ్ క్లారిటీ ఇచ్చాడు.
చదవండి: ఇండస్ట్రీకి నా అవసరం లేదు.. హనీరోజ్ భావోద్వేగం
Tags : 1