29వ సీటు నుంచి 11వ సీటుకు సతీష్ లగేజీ
Breaking News
1996లో బ్యాంక్ పాస్ బుక్ అలా ఉండేదా..! ఆ రోజుల్లోనే..
Published on Sun, 11/16/2025 - 15:09
ప్రస్తుత కాలంలోని బ్యాంక్ పాస్ బుక్‌లు గురించి తెలిసిందే. కానీ 1996ల టైంలో ఉండే పాస్‌బుక్ గురించి ఈ జనరేషన్‌కి అంతగా ఐడియా ఉండదు. నెటింట ఆ కాలం నాటి పాస్ బుక్ తెగ వైరల్‌గా మారింది. అది ఒక పెన్షన్ అందుకునే ఖాతాదారుడి పుస్తకం. అందులో సేవింగ్స్ చూసి నెటిజన్లు విస్తుపోతున్నారు. వచ్చిన పెన్షన్ తక్కువే అయినా..ఎంత అద్భుతంగా డబ్బుని పొదుపు చేశారో చూస్తే..ఆర్థిక విషయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది క్లియర్‌గా తెలుస్తోంది.
ఒక సోషల్ మీడియా వినియోగదారుడు నెట్టంట తన తాత గారి 199ల నాటి ఎస్‌బీఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) పాస్ బుక్‌ని వీడియో తీసి పోస్ట్‌చేశాడు. ఇప్పుడు ప్రతిది డిజిటల్‌గా మారిన తరుణంలో ఈ పాస్‌బుక్ సర్వత్రా ఆసక్తిని రేకెత్తించింది. ఈ పాస్‌బుక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ జైపూర్ అండ్ బికనీర్‌ది. ఆ సమయంలో ఎస్‌బీఐ అనుబంధ బ్యాంక్ పాస్‌బుక్‌లు ఇలా ఉండేవా ఆ బ్యాంక్‌బుక్‌ని చూడగానే అనిపిస్తుంది.
వీడియోలో ఆ వ్యక్తి పాస్‌బుక్ డిజైన్, ఫోటో పేజీ, ఎంట్రీ పేజీ, తాతాగారి పెన్షన్ పొదుపు డబ్బు ఇలా ప్రతీది చూపిస్తాడు. తన తాత ఫోటో ఉన్న మొదటి పేజీ నుంచి పాస్ బుక్ ముద్రణ, కాగితం నాణ్యత, పాత కాలపు టెంప్లేట్..పెన్షన్, పొదుపు ఎంట్రీలతో సహా అన్నింటిని క్లియర్‌గా చూపిస్తాడు వీడియోలో. అందులో తాతగారి పెన్షన్ రూ. 5000 కాగా, పొదుపు రూ. 25 వేలకు చేరుకున్నట్లు క్లియర్‌గా కనిపిస్తోంది.
అంతేగాదు ఆ బుక్ చివరి పేజీలో నిరంతర పెన్షన్, నగదు సర్టిఫికేట్ మొదలైన పదాలు చూడగానే అవి ఇప్పుడు చాలా అరుదుగా కనిపిస్తాయని చెప్పొచ్చు. దాదాపు 80 సెకన్ల నిడివి గల ఈ వీడియో, చిన్నా పెద్దా ప్రతి ఎంట్రీని చేతితో రాసిన కాలం నాటి బ్యాంకింగ్ ప్రక్రియను గుర్తు చేస్తోంది.
ఆ వీడియోని చూసిన నెటిజన్లు కూడా ఆ కాలం నాటి పాస్‌బుక్‌ల ఫాంట్, ఇంక్, ప్రింట్ లుక్, చేతితో రాసిన ఎంట్రీలు ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని అందించాయి అని కామెంట్లు చేస్తూపోస్టులు పెట్టారు. అంతేగాదు బ్రో ఈ అకౌంట్ ఇంకా యాక్టివ్‌గానే ఉందే అని ప్రశ్నించారు కూడా.
(చదవండి: గాజు డిస్క్: చిన్నదేగానీ..చిరంజీవి)
Tags : 1