Chandrasekhar : ఇది ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వం బిహార్ కంటే దారుణంగా లోకేష్ రెడ్ బుక్
Breaking News
'వారణాసి'లో పవర్ఫుల్ దేవత.. రాజమౌళి ప్లాన్ అదుర్స్
Published on Sun, 11/16/2025 - 13:07
మహేష్ బాబు, రాజమౌళి సినిమా వారణాసి నుంచి టైటిల్ గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు. దీంతో ఈ మూవీ కాన్సెప్ట్ గురించి కాస్త హింట్ వచ్చేసింది. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలతో ఈ మూవీ రానుందని అర్థం అవుతుంది. భూమి ఆవిర్భావం మొదలు.. త్రేతా యుగం వరకూ ఆపై ఉల్కాపాతాల ప్రళయం, ఘోర కలి వరకు అన్ని కాలాలతో వారణాసి కథకు లింక్ అయినట్లు తెలుస్తోంది. ఇలా వేర్వేరు కాలాలతో కథ ఉన్నప్పటికీ దానిని కలిసే డాటెడ్ లైన్ మహేష్ అని కనిపిస్తుంది. అయితే, ఇందులో రాక్షస ఘణాన్ని వేటాడే 'ఛిన్నమస్తా దేవి' విజువల్ చాలా ప్రత్యేకంగా ఉంది. ఆమెను ప్రసన్నం చేసుకున్నవారికి అతీంద్రియ శక్తులు అందుతాయి. ఆపై ఎదుటివారు ఎంతటి గొప్పవారైనే సరే చీల్చిచెండాడే శక్తి సొంతమౌతుంది.
ఛిన్నమస్తా దేవి దశ మహావిద్యలలో ఒక ముఖ్యమైన దేవత. అమ్మవారు తన తలను తన చేతితోనే నరికి పట్టుకున్నట్లు ఉంటుంది. ఆమె తల నుంచి వచ్చే రక్తాన్ని కుడి, ఎడమ పక్కన ఉన్న డాకిని, వర్ణినిలు తాగుతున్నట్లు ఉంటుంది. ఎంతో భయంకరంగా కనిపించేలా ఆమ్మవారి రూపం ఉంటుంది. ఈమెను శక్తి యొక్క రౌద్ర రూపంగా పూజిస్తారు. చిన్నమస్తా దేవి కథను తెలుసుకుంటే మరణంతో పాటు సృష్టి, వినాశనం అనే వైరుధ్యాలను సూచిస్తుంది. ఆమెను కేవలం తంత్రవిద్యను అభ్యసించే వాళ్లు మాత్రమే పూజిస్తారు.

వారణాసితో లింక్
ఛిన్నమస్తా దేవి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు సంబంధించి తెలుసుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఆమెను ప్రసన్నం చేసుకునేందుకే రుద్ర పాత్రలో ఉన్న మహేష్ బాబు కూడా అక్కడ ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆపై అమ్మవారి ఖడ్గం మీద ప్రియాంక చోప్రా కనిపిస్తుంది. పురాణాల ప్రకారం రాక్షస ఘణాన్ని అంతం చేసినప్పటికీ ఆమెకు రక్త దాహం తీరలేదు. తన వెంట ఉన్న వారికి కూడా తీరకపోవడంతో స్వయంగా శిరచ్ఛేదం చేసుకుని రక్తాన్ని అందిస్తుంది. అంతటి ఉగ్రరూపంతో ఆమె ఉంటుంది. సినిమా ప్రకారం ఉన్న రాక్షస ఘణాన్ని ఎదుర్కునేందుకు కావాల్సిన శక్తిని రుద్ర పాత్రలో ఉన్న మహేష్ ఆమె కటాక్షం పొందవచ్చని తెలుస్తోంది.
ఆమె ఆశీస్సులు కేవలం ధైర్యవంతులకు మాత్రమే సొంతం అవుతుంది. ఆమె శత్రు నాశని కూడా అందుకే రాజమౌళి ఆమె పాత్రను వారణాసిలో చూపించనున్నారు. ఆమె పార్వతి దేవి రూపం అని కూడా పూరాణాల్లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలోని రామ్‌నగర్‌లో ఆమె ఆలయం ఉంది. పశ్చిమ బెంగాల్‌లోని బిష్ణుపూర్‌లో కూడా ఛిన్నమస్తా అమ్మవారి ఆలయం ఉంది.
Tags : 1