మాజీ AVSO సతీశ్ కుమార్ మృతి కేసులో సీన్ రీకన్ స్ట్రక్షన్
Breaking News
ప్రభాస్ కొత్త సినిమా.. టెన్షన్‌లో ఫ్యాన్స్!
Published on Sat, 11/15/2025 - 14:55
ప్రస్తుతం హీరోలు ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే గగనమైపోతుంది. ఒక సినిమా విడుదలైన తర్వాతే కొత్త ప్రాజెక్ట్‌ని ప్రకటించి.. షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు. కానీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas ) మాత్రం ఒకేసారి నాలుగైదు సినిమాలను ప్రకటించి..అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ ఎప్పుడో ప్రకటించినవే. ఆయన చేతిలో ఇంకా నాలుగైదు సినిమాలు ఉన్నాయి. ఆయన నటించిన ది రాజాసాబ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
ప్రస్తుతం ఆయన పౌజీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ది రాజా సాబ్ రిలీజ్ తర్వాత స్పిరిట్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లబోతున్నాడు. మరోవైపు సలార్ 2, కల్కి 2 చిత్రాలు కూడా లైనప్‌లో ఉన్నాయి. ఇవీ కాకుండా ప్రశాంత్ వర్మతో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. ఇంత బిజీగా ఉన్న ప్రభాస్..తాజాగా ఇంకో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
కొరియోగ్రాఫర్‌కి చాన్స్..
ప్రముఖ కొరియోగ్రాఫర్, ‘నాటు నాటు’ ఫేమ్ ప్రేమ్ రక్షిత్(Prem Rakshit)తో ప్రభాస్ ఓ చిత్రాన్ని చేయబోతున్నాడట. అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ఇప్పుడీ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది . ఇప్పటికే ప్రభాస్ ఒప్పుకున్న సినిమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేయడానికి దాదాపు రెండేళ్ల సమయంలో పట్టే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో ప్రభాస్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అందరికి ఆశ్చర్యానికి గురి చేసింది. ది రాజాసాబ్ షూటింగ్ సమయంలోనే ప్రేమ్ రక్షిత్..ప్రభాస్‌కి కథ చెప్పాడట. అది బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పేశాడట.
టెన్షన్‌లో ప్రభాస్ ఫ్యాన్స్
ప్రభాస్ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ స్టార్. ఆయన సినిమా కోసం కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు. బాహుబలి లాంటి భారీ హిట్ కావాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కానీ కల్కి మినహా మిగతా చిత్రాలన్నీ బాహుబలి స్థాయిలో విజయం సాధించలేదు. ఇలాంటి సమయంలో కొత్త దర్శకుడుకి చాన్స్ ఇచ్చి ప్రభాస్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అయితే ఇందులో ప్రభాస్ నటించడని.. ఇదొక యానిమేషన్ సినిమా అని, ప్రభాస్ వాయిస్ ఓవర్ అందించడానికే ఓకే చెప్పినట్లు టాక్. ఇందులో వాస్తవం ఏంటనేది అధికారిక ప్రకటన వస్తేనే తెలుస్తుంది.
Tags : 1