Breaking News

కొత్త జాబ్‌ ట్రెండ్స్‌.. ప్రయోగాత్మక పని విధానాలు

Published on Sat, 11/15/2025 - 11:10

భారత్‌లో పని సంస్కృతి మార్పు క్రమంలో ఉందని, భవిష్యత్తు అంతా ప్రయోగాత్మక పని విధానాలు, పరిస్థితులకు అనుణంగా మార్పులను స్వీకరించే వారిదేనని మెజారిటీ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇండీడ్‌ కోసం వాలువోక్స్‌ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేకు సంబంధించి వివరాలతో ‘వర్క్‌ప్లేస్‌ ట్రెండ్స్‌ రిపోర్ట్‌ 2025’ విడుదలైంది.

ప్రయోగాత్మక పని నమూనాలు, పరిస్థితులకు అనుగుణంగా మారే వారికే భవిష్యత్తు ఉంటుందని 58 శాతం మంది భారత ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రివర్స్‌ మెంటారింగ్‌ (సీనియర్లకు జూనియర్ల మార్గదర్శనం), మైక్రో రిటైర్మెంట్‌ (కెరీర్‌లో స్వల్ప విరామాలు), ఏఐ మూన్‌షైనింగ్‌ (జాబ్‌ టాస్క్‌ల కోసం ఏఐని గోప్యంగా వినియోగించడం), ఏఐ వాషింగ్, స్కిల్‌ నోమడిజమ్‌ (పనికి సంబంధించి కొత్త నైపుణ్యాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం) వంటి కొత్త పని ధోరణులను ప్రయోగాత్మక పని నమూనాలుగా ఈ నివేదిక అభివర్ణించింది. 2,584 మంది ఉద్యోగులు, 1,288 సంస్థల అభిప్రాయాలను ఈ సర్వే కోసం పరిగణనలోకి తీసుకున్నారు.  

వృద్ధికే ప్రాధాన్యం.. 
వృద్ధికే మొదటి ప్రాధాన్యమని ప్రతి ఐదుగురు భారత ఉద్యోగుల్లో ఇద్దరు భావిస్తున్నారు. ముఖ్యంగా ఎప్పటికప్పుడు అదనపు నైపుణ్యాలు నేర్చుకోవడం, రోజువారీ విధులతో ఏఐని అనుసంధానించడం వంటివి అనుసరిస్తున్నారు. తమ కష్టాన్ని గుర్తించడం వరకే కాకుండా.. కొత్తగా నేర్చుకునేందుకు, తమని తాము తిరిగి ఆవిష్కరించుకునేందుకు గాను కొంత సమయం కేటాయింపు, ప్రస్తుత ఉద్యోగంలో విరామం అవసరమని ఉద్యోగులు భావిస్తున్నారు.

ఎప్పుడూ పనిచేసుకుపోవడం అన్న విధానానికే పరిమితం కాకుండా.. విరామం, తిరిగి నైపుణ్యాలు ఆర్జించడం వంటి కొత్త ధోరణి ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 41 శాతం మంది ఉద్యోగులు తమకంటూ బలమైన సరిహద్దులు విధించుకుని, కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటున్నట్టు చెప్పారు. నైపుణ్యాల పెంపునకు ఎక్కువ మంది ఉద్యోగులు ఆసక్తి చూపిస్తున్నట్టు ఇండీడ్‌ ఇండియా ఎండీ శశికుమార్‌ తెలిపారు. వ్యక్తిగత వృద్ధి, సంప్రదాయేతర పని ఏర్పాట్లు భవిష్యత్తు కార్పొరేట్‌ ఇండియా ప్రధాన లక్షణాలుగా ఉంటాయన్నారు.

Videos

లులూ మాల్ లో గోమాంసం.. టీడీపీ MOUపై పవన్ సీరియస్

విశాఖ అభివృద్ధిపై YS జగన్ మోహన్ రెడ్డి మార్క్

కోటి సంతకాల సేకరణలో అన్నా రాంబాబు

నితీష్ ఇంటికి చిరాగ్ పాశ్వాన్.. బీహార్ లో కొత్త సీఎం..

ఫొటోలకే తప్ప పావలాకి కూడా పనికిరాని డిప్యూటీ సీఎం

స్టూడెంట్స్ చస్తున్నా.. నో యాక్షన్.. నో రియాక్షన్

Chirla Jaggireddy: చంద్రబాబుని చూసి కుక్కలు కూడా భయపడటం లేదు

హైదరాబాద్ బిర్యానీ పై బాబు కామెంట్స్ జక్కంపూడి విజయలక్ష్మి సెటైర్లు

మాగంటి సునీత ఇంటికి కేటీఆర్

CII వేదికగా సీన్ రివర్స్.. అందరిముందు బాబు కుట్ర బట్ట బయలు

Photos

+5

‘కాంత’ సినిమా ప్రెస్ మీట్ లో భాగ్యశ్రీ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

#KrithiShetty : క్యూట్ లూక్స్‌తో కృతి శెట్టి (ఫొటోలు)

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)