మెలోడ్రామాలు వద్దు.. కరీష్మా కుమార్తెపై కోర్టు అసహనం

Published on Sat, 11/15/2025 - 10:04

కరీష్మా కపూర్‌ మాజీ భర్త సంజయ్‌ కుమార్‌ ఆస్తి వ్యవహారం ఢిల్లీ కోర్టులో విచారణకు వచ్చింది. తమ తండ్రి దివంగత సంజయ్‌ కపూర్‌ ఆస్తుల్లో వాటా కోసం  కరిష్మా కపూర్‌ కుమార్తె, కుమారుడు న్యాయ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే రెండు నెలలుగా తన ఫీజులు కట్టలేదని కరీష్మా కపూర్‌ కుమార్తె కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. అయితే, ఇలాంటి మెలోడ్రామాలు చేయవద్దంటూ న్యాయస్థానం హెచ్చరించింది.

నటి కరిష్మా కపూర్ పిల్లల తరపున వాదిస్తున్న న్యాయవాది మహేష్ జెఠ్మలానీ  ఢిల్లీ హైకోర్టులో మాట్లాడుతూ.. పిల్లలలో ఒకరైన సమైరాకు రెండు నెలలుగా కాలేజీ ఫీజు చెల్లించలేదని తెలిపారు. చట్టప్రకారం పిల్లల ఖర్చులను తండ్రిగా సంజయ్ భరించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. అయితే, పిల్లల ఆస్తి మొత్తం ప్రియా కపూర్ వద్ద ఉందని తెలిపారు.

అయితే, కరిష్మా పిల్లల వాదనను ప్రియా కపూర్ సవాలు చేశారు. అమెరికాలో చదువుతున్న కరిష్మా పిల్లలకు సంబంధించి రెండు నెలల ఫీజు చెల్లించలేదు అనేది పూర్తిగా అబద్దమని ప్రియా కపూర్ తరపున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ నాయర్ పేర్కొన్నారు. పిల్లలకు ఇవ్వాల్సిన ఆస్తి, వారి చదువులకు కావాల్సిన అన్ని ఖర్చులు ఇప్పటికే ఇవ్వడం జరిగిందన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తడం వెనుక అసలు ఉద్దేశ్యం వార్తాపత్రికలో సింపతీ కోసమేనని ఆయన అన్నారు.

ఇరువురి వాదనలు విన్న తర్వాత న్యాయస్తానం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి మెలోడ్రామాలు వద్దంటూ  హెచ్చరించింది. ఇలాంటి అంశాలు మళ్లీ కోర్టు ముందుకు రాకుండా చూసుకోవాలని జస్టిస్ సింగ్  ఇలా అన్నారు.. “నేను దీని కోసం 30 సెకన్ల కంటే ఎక్కువ సమయం వెచ్చించాలనుకోవడం లేదు. ఈ ప్రశ్న మళ్ళీ నా కోర్టుకు రాకూడదు,  ఉండకూడదని నేను కోరుకుంటున్నాను” అని  హెచ్చరించారు. వాదనలు కొనసాగించడానికి కోర్టు  వచ్చే వారానికి వాయిదా వేసింది. పిల్లలకు  ఫీజులు కట్టలేదనే స్టేట్‌మెంట్స్‌ ఇవ్వద్దని కరిష్మా కపూర్ కుమార్తెకు న్యాయస్థానం సూచించింది.

తమ తండ్రి ఆస్తులు మొత్తం కొట్టేయడానికి  సవతి తల్లి ప్రియా కపూర్‌(ప్రియా సచ్‌దేవ్‌) కుట్ర చేస్తోందని కరిష్మా పిల్లలు పేర్కొన్నారు. సంజయ్‌ కపూర్‌కు రూ.30,000 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఆస్తి గురించి తమ తండ్రి మరణానికి ముందు ఎలాంటి విల్లు రాయలేదని చెప్పారు. కోర్టులో వారు చూపిస్తున్న పత్రాలు కూడా నకిలీవని కరిష్మా కపూర్‌ కుమార్తె, కుమారుడు ఆరోపించారు.

ఏమిటీ వివాదం?  
ప్రముఖ వ్యాపారవేత్త సంజయ్‌ కపూర్‌ తొలుత నందితాను వివాహం చేసుకున్నారు. 1996 నుంచి 2000 సంవత్సరం దాకా వారు కలిసున్నారు. విడాకుల తర్వాత సంజయ్‌ కపూర్‌ 2003లో కరిష్మా కపూర్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వారికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్‌ ఉన్నారు. 2016లో అభిప్రాయభేదాల వల్ల సంజయ్‌ కపూర్, కరిష్మా విడిపోయారు. అనంతరం 2017 ప్రియా సచ్‌దేవ్‌ను సంజయ్‌ పెళ్లాడారు. సంజయ్‌ కపూర్‌ ఈ  ఏడాది జూన్‌ 12న హఠాత్తుగా మృతిచెందిన సంగతి తెలిసిందే. లండన్‌లో పోలో ఆడుతుండగా గొంతులోకి తేనెటీగ దూసుకెళ్లింది. దాంతో ఆయన గుండెపోటుకు గురై కన్నుమూశారు.

Videos

బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

ఆసుపత్రిలో హై టెన్షన్.. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్.. 17 మంది పిల్లలకు సీరియస్

TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..

జమ్మూ కాశ్మీర్ బ్లాస్ట్.. పేలుడు ధాటికి 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ బాడీలు

2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..

బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల

నితీష్ కు షాక్.. బీహార్ లో బీజేపీ సీఎం

ఫోన్ పట్టుకుని తెగ షూట్ చేస్తున్నాడు.. పవన్ పై తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్లు

Photos

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)

+5

అక్షర్‌ పటేల్‌ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)