ఆల్‌–ఉమెన్‌ రూట్స్‌ కేఫ్‌

Published on Sat, 11/15/2025 - 00:35

‘నేను ఎంత సంపాదించాను’  అని లెక్కలు వేసుకునేవారు కోకొల్లలుగా ఉంటారు. ‘నేను ఏం తింటున్నాను’ అని  ఆరోగ్య ప్రమాణాలతో విశ్లేషించుకునేవారు  వేళ్ల మీద లెక్కించే స్థాయిలోనే ఉంటారు. సుప్రీం కోర్టు లాయర్‌ మీనాక్షి కుమార్‌ రెండో కోవకు చెందిన వ్యక్తి. 

వివిధ రకాల వంటకాలు నేర్చుకోవడానికి థాయ్‌లాండ్‌ వెళ్లి ప్రత్యేక శిక్షణ తీసుకున్న మీనాక్షి...  ఇండియాకు తిరిగి వచ్చిన తరువాత  ‘తాజా కూరగాయలు – తాజా వంటకాలు’  నినాదంతో ‘రూట్స్‌ కేఫ్‌’ పేరుతో ఫామ్‌–టు–టేబుల్‌ ఫుడ్‌ కేఫ్‌ స్టార్ట్‌ చేసి దానిని ఆల్‌–ఉమెన్‌ కేఫ్‌గా తీర్చిదిద్దింది. తన పొలంలో రసాయన రహిత కూరగాయలు పండిస్తోంది. మహిళా ఆర్థిక స్వాతంత్య్రం ప్రాముఖ్యత గురించి ప్రచారం చేస్తోంది..

నల్లకోటులో సుప్రీం కోర్టు కారిడార్‌లలో బిజీ బిజీగా కనిపించేది మీనాక్షి కుమార్‌. ఆమె తండ్రి కూడా న్యాయవాది. క్రిమినల్‌ లాయర్‌గా మంచి పేరు తెచ్చుకుంది. 2011 సంవత్సరం ఆమె జీవితాన్ని కొత్తదారిలోకి తీసుకువెళ్లింది. ఆ సంవత్సరం యూకేలోని న్యూ క్యాజిల్‌ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో మాస్టర్స్‌ డిగ్రీ చేయడానికి వెళ్లింది మీనాక్షి.

సరదాగా మొదలైంది...
యూనివర్శిటీలోని డార్మిటరీ కిచెన్‌లో సరదాగా వంట చేసేది మీనాక్షి.  ఆ సరదా కాస్తా ఫ్యాషన్‌గా మారింది. యూకేలో తనకు సింగపూర్‌ వ్యక్తి పరిచయం అయ్యాడు. అతడు ఇలా అన్నాడు.... ‘చదువు కోసం మాత్రమే కాదు మనకు ఆనందాన్ని ఇచ్చే కొత్త విద్యలు నేర్చుకోవడానికి కూడా సెలవులు పెట్టవచ్చు’ చార్టెర్డ్‌ ఎకౌంటెంట్‌ అయిన అతడు కిక్‌ కోసం పేస్ట్రీ స్టూడెంట్‌గా మారాడు. అతడి మాటలు మీనాక్షిపై బాగా ప్రభావం చూపించాయి. వెంటనే బ్యాంకాక్‌కు వెళ్లి ప్రసిద్ధ పాకశాస్త్ర పాఠశాల ‘లె కార్డాన్‌ బ్లూ’లో చేరింది. అది తొమ్మిది నెలల కోర్సు. స్టార్‌ చెఫ్‌ గగన్‌ ఆనంద్‌ దగ్గర పాఠాలు నేర్చుకునే అవకాశం వచ్చింది.  అలా వచ్చింది ఒక ఐడియా!

మీనాక్షి ఇండియాకు వచ్చిన తరువాత, కోవిడ్‌ కల్లోలం మొదలైంది. ఇంటికే పరిమితమైన ఆమె టెర్రస్‌పై రకరకాల కూరగాయలు పండించేది. ‘సరిగ్గా వినియోగించుకుంటే చిన్న స్థలంలో కూడా పెద్ద దిగుబడి సాధించవచ్చు’ అనే విషయాన్ని గ్రహించిన మీనాక్షి ఆ తరువాత నోయిడాలోని తన కుటుంబానికి చెందిన ఎకరం పొలంలో సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టింది. ఆ వ్యవసాయ క్షేత్రం ఆమె ప్రయోగశాలగా మారింది. ఒకరోజు మార్నింగ్‌ వాక్‌కు వెళుతూ ఒక మూలన మూతబడి ఉన్న పిజ్జా పాయింట్‌ను చూసింది మీనాక్షి. ఆ సమయంలోనే తనలో ఒక ఆలోచన మెరిసింది.

రూట్స్‌ కేఫ్‌ మొదలైంది ఇలా...
‘తాజా కూరగాయలు... తాజా వంటకాలు’ నినాదంతో ‘రూట్స్‌ కేఫ్‌’ ప్రారంభించింది. తమ పొలంలో పండిన కూరగాయలనే ‘రూట్‌ కేఫ్‌’లో వినియోగించేవారు. సీజన్‌లను బట్టి మెనూ మారుతుంది. ‘ప్రతిదీ తాజాగా’ అనే పేరు రావడంతో ‘రూట్స్‌ కేఫ్‌’ బాగా క్లిక్‌ అయింది.

మన దేశంలో పండే కూరగాయలే కాకుండా ప్రపంచవ్యాప్త ప్రసిద్ధి పొందిన కూరగాయలతో చేసిన వంటకాలు ‘రూట్స్‌ కేఫ్‌’లో అందుబాటులో ఉంటాయి. ‘రూట్స్‌ కేఫ్‌’ను ప్రత్యేకంగా నిలబెట్టింది దేశ, విదేశ రసాయన రహిత కూరగాయలతో చేసిన నోరూరించే వంటకాలు మాత్రమే కాదు... సిబ్బంది కూడా. ‘రూట్స్‌ కేఫ్‌’లో ఉద్యోగులందరూ మహిళలే. ‘రూట్స్‌ కేఫ్‌లో పనిచేయాలనుకునే మహిళలకు ప్రధాన అర్హత...వారికి ఎలాంటి అనుభవం లేక΄ోవడం! ఇది ఆశ్చర్యంగా ఉండవచ్చు. అయితే అనుభవం లేని వారే ఆసక్తితో అన్నీ నేర్చుకుంటారు. వారిలో అంకితభావం అధికంగా కనిపిస్తుంది. రూట్స్‌ కేఫ్‌ను ఆల్‌–ఉమెన్‌ కేఫ్‌గా తీర్చిదిద్దడంలో విజయం సాధించాను’ అంటుంది మీనాక్షి.

జీరో నుంచి శిక్షణ
‘రూట్స్‌ కేఫ్‌’లో చేరిన మహిళలకు కూరగాయలు కోయడం, వంట చేయడం నుంచి వడ్డించడం వరకు జీరో నుంచి శిక్షణ ఇచ్చింది మీనాక్షి. ‘ఉద్యోగం చేస్తున్నాను అనే సంతోషం కంటే కొత్త విద్య నేర్చుకున్నామనే సంతృప్తి వారిలో కనిపిస్తుంది’ అని రూట్స్‌ కేఫ్‌లో పనిచేసే ఉద్యోగుల గురించి చెబుతోంది మీనాక్షి. గృహిణిగా పదిహేడు సంవత్సరాలు ఇంటికే పరిమితమైన మీనాక్షి ‘రూట్స్‌ కేఫ్‌’తో ఉద్యోగ ప్రస్థానం మొదలుపెట్టింది.

‘కోవిడ్‌ తరువాత మాకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఏదైనా ఉద్యోగం చేయాలని గట్టిగా అనుకున్నాను. కాని నాకు ఎవరు ఉద్యోగం ఇస్తారు? మీకు ఎలాంటి అనుభవం ఉండనక్కర్లేదు. ఇంటర్వ్యూకు వచ్చేయండి...అనే రూట్స్‌ కేఫ్‌ పిలుపు నన్ను ఆకట్టుకుంది. ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. నా జీవితంలో తొలిసారిగా ఉద్యోగంలో చేరాను. నెల జీతం ఇరవై వేలు అందుకున్నప్పుడు నా సంతోషానికి హద్దులు లేవు. ఇది నేను సాధించిన జీతం అనే భావన ఎంతో సంతృప్తిని ఇచ్చింది’ అంటుంది మధుమిత. ఇలాంటి మధుమితలెందరికో కొత్త జీవితాన్ని ఇచ్చింది రూట్స్‌ కేఫ్‌.
 
ఆర్థిక స్వాతంత్య్రమే... అసలైన ప్రాధాన్యత
మోడల్‌ స్ట్రీట్‌ఫుడ్‌ కార్ట్‌లు, హై–ఎండ్‌ కాఫీ ప్రోగ్రామ్స్, ప్రాంతీయ వంటకాలతో ప్రయోగాలు... మొదలైనవాటితో ‘రూట్స్‌ కేఫ్‌’ విజయపథంలో దూసుకు΄ోవడం ఒక కోణం అయితే, మరో కోణం... స్త్రీల ఆర్థిక స్వాతంత్రానికి విలువనిచ్చే వేదికగా రూట్స్‌ కేఫ్‌ పేరు తెచ్చుకోవడం.
‘డబ్బు అనేది మహిళలకు మాట్లాడే గొంతును ఇస్తుంది. స్వేచ్ఛను, గౌరవాన్నీ ఇస్తుంది’ అంటున్న మీనాక్షి కుమార్‌ ఎంతోమంది మహిళలకు శిక్షణ ఇచ్చి మరీ తన‘రూట్స్‌ కేఫ్‌’లో ఉద్యోగాలు ఇచ్చింది.

ప్రతిరోజూ ఆ ఉత్సాహం మీలో ఉంటే...
మొదటి అడుగు వేయడం అత్యంత కష్టతరమైనది కావచ్చు. అంతమాత్రాన అధైర్య పడవద్దు. ఒక అడుగు పడిన తరువాత భయం వెనకడుగు వేయిస్తుంది. ఆ తరువాత మాత్రం ప్రయాణం సజావుగానే సాగుతుంది. ప్రతిరోజూ ఉదయం మీలో ‘ఈ రోజు ఉద్యోగానికి వెళుతున్నాను’ అనే ఉత్సాహం కనిపిస్తుంటే మీరు సరిౖయెన బాటలోనే ప్రయాణిస్తున్నారని అర్థం. పూర్తిగా మహిళల నేతృత్వంలో ఒక కేఫ్‌ నడుపుతున్నందుకు గర్వంగా ఉంది. అయితే వ్యాపారం అన్నాక అన్నీ సంతోషకరమైన రోజులే ఉండవు. కొన్నిసార్లు కస్టమర్లు ఉండరు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అయినప్పటికీ అన్నింటినీ తట్టుకుని ఉత్సాహంగా ముదుకు సాగాలి.

– మీనాక్షి కుమార్‌

Videos

బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

ఆసుపత్రిలో హై టెన్షన్.. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్.. 17 మంది పిల్లలకు సీరియస్

TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..

జమ్మూ కాశ్మీర్ బ్లాస్ట్.. పేలుడు ధాటికి 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ బాడీలు

2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..

బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల

నితీష్ కు షాక్.. బీహార్ లో బీజేపీ సీఎం

ఫోన్ పట్టుకుని తెగ షూట్ చేస్తున్నాడు.. పవన్ పై తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్లు

Photos

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)

+5

అక్షర్‌ పటేల్‌ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)