కలల జాబ్‌ కనీసం నెల కూడా చేయలేదు..

Published on Fri, 11/14/2025 - 14:51

ఉద్యోగం రావడమే కష్టమైన ప్రస్తుత రోజుల్లో దిగ్గజ కంపెనీలలో జాబ్దక్కించుకోవడం అంటే సాహసమనే చెప్పాలి. చదువు పూర్తయి సంవత్సరాలు గడుస్తున్నా సరైన ఉద్యోగం రానివారు చాలా మందే ఉన్నారు. కానీ బెంగళూరుకు చెందిన యువతి వేగంగా కెరియర్వేగాన్ని చూస్తే ఆశ్చర్యంతో అభినందించాల్సిందే.

ప్రపంచ టెక్దిగ్గజం గూగుల్లో జాబ్ఎందరికో కలల ఉద్యోగం. అంతటి ఘనమైన ఉద్యోగాన్ని దక్కించుకున్న యువ టెకీ.. ఒక్క నెల కూడా గడవకముందే వద్దుపో.. అని వదిలేసింది. వ్యక్తిగత జీవితంతోపాటు వృత్తిగత మైలురాళ్లు, ప్రస్థానాన్ని సోషల్మీడియాలో పంచుకోవడం ప్పుడు పరిపాటి. అలాగే అనుష్క శర్మ కూడా తన కెరియర్గమనాన్నిఎక్స్‌’(ట్విటర్‌)లో షేర్చేశారు.

బెంగళూరుకు చెందిన అనుష్క శర్మ 20 ఏళ్ల వయసులో ఇన్వెస్ట్మెంట్బ్యాంకింగ్జాబ్తో తన కెరియర్ను ప్రారంభించారు. తర్వాత మూడేళ్లకు అది మానేసి మాస్టర్స్పూర్తి చేశారు. అనంతరం 24 ఏళ్లకు అమెజాన్లో అంతర్జాతీయ ఉద్యోగాన్ని తెచ్చుకున్నారు. తర్వాత ఏడాదే ఎంబీఏ చేసిన ఆమె 26 ఏళ్ల వయసులో ప్రఖ్యాత గూగుల్లో మంచి జాబ్దక్కించుకున్నారు. కానీ చేరి నెల రోజులు కూడా గడవకుండానే దాన్ని వదిలేశారు. అనంతరం వ్యక్తిగత జీవితంలో మరో మెట్టు ఎక్కారు. పెళ్లి చేసుకుని 27 ఏళ్లకే సొంతంగా కంపెనీ పెట్టేశారు. ఆమె కంపెనీ పేరుడ్రింక్క్వెంజీ’. ఇదో ప్రోబయోటిక్ సోడా కంపెనీ.

అనుష్క శర్మకు పోస్ట్కు సోషల్మీడియాలో విస్తృత స్పందన వచ్చింది. విజయవంతమైన ఆమె కెరియర్గమనాన్ని నెటిజనులు అభినందించకుండా ఉండలేకపోయారు. ‘మీ అనుభవానికే సంబంధం లేని సోడా కంపెనీని ఎలా ప్రారంభించారు?’ అంటూ యూజర్ఆశ్చర్యపోయారు. ‘ గూగుల్ జాబ్ను ఎందుకు విడిచిపెట్టారు? అని మరో యూజర్ఆతృతగా ప్రశ్నించగా దానికామె వ్యక్తిగత కారణాలు అని బదులిచ్చారు.

ఇదీ చదవండి: నమ్ముకున్న ఉద్యోగులకు అనిల్‌ అంబానీ వరాలు

ఇక అనుష్క శర్మ విద్యార్హతల విషయానికి వస్తే.. ఆమె లింక్డ్ఇన్బయో ప్రకారం.. వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అనుష్క శర్మ ఆ తర్వాత ఈఎస్సీపీ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు.

Videos

బడా క్రెడిట్ చోర్.. ఇలాంటి వాళ్ళతో జాగ్రత్త!

మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి

ఆసుపత్రిలో హై టెన్షన్.. ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్.. 17 మంది పిల్లలకు సీరియస్

TTD మాజీ ఏవీఎస్వో సతీష్ కుమార్ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే

అదే దెబ్బ కొట్టింది.. బీహార్ ఓటమిపై రాహుల్ రియాక్షన్..

జమ్మూ కాశ్మీర్ బ్లాస్ట్.. పేలుడు ధాటికి 300 మీటర్ల దూరంలో ఎగిరి పడ్డ బాడీలు

2026లో దీదీకి షాక్ తప్పదు! బెంగాల్ లో బీహార్ సీన్ రిపీట్ చేస్తాం..

బుమ్రా దెబ్బకు దక్షిణాఫ్రికా విలవిల

నితీష్ కు షాక్.. బీహార్ లో బీజేపీ సీఎం

ఫోన్ పట్టుకుని తెగ షూట్ చేస్తున్నాడు.. పవన్ పై తాటిపర్తి చంద్రశేఖర్ సెటైర్లు

Photos

+5

‘కాంత’ సినిమా సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బాలల దినోత్సవం..నెహ్రూ జూ పార్క్‌కు సందర్శకుల తాకిడి (ఫొటోలు)

+5

ఎల్బీ స్టేడియంలో సందడిగా 'అరైవ్-లైవ్' కార్యక్రమం (ఫొటోలు)

+5

హైలైఫ్ ఎగ్జిబిషన్ లో సందడి చేసిన మోడల్స్ (ఫొటోలు)

+5

ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి దర్శనానికై మెట్ల మార్గంలో వరల్డ్‌కప్‌ విన్నర్‌ శ్రీచరణి (ఫొటోలు)

+5

మృణాల్ 'డకాయిట్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సిద్ధార్థ్ సతీమణి ఆదితి రావు హైదరీకి అరుదైన అవార్డ్ (ఫొటోలు)

+5

అక్షర్‌ పటేల్‌ నూతన గృహ ప్రవేశం.. విల్లా పేరు ఇదే! (ఫొటోలు)

+5

కాంగ్రెస్‌ ఘన విజయం.. గాంధీభవన్‌లో హస్తం నేతల సంబరాలు (ఫొటోలు)