Madanapalle: యమునకు ఒక కిడ్నీ తొలగించినట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడి
Breaking News
ఫుల్ బిజీగా...
Published on Thu, 11/13/2025 - 04:28
సినిమా ఇండస్ట్రీలో నటుడిగా సక్సెస్‌ఫుల్‌గా 23 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ప్రభాస్. ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం ‘ఈశ్వర్’ 2002 నవంబరు 11న విడుదలైంది. ఈ చిత్రాన్ని జయంత్. సి పరాన్జీ దర్శకత్వంలో కె. అశోక్ కుమార్ నిర్మించారు. కాగా, హీరోగా ప్రభాస్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన తాజా చిత్రాల్లో ఒకటైన ‘ది రాజాసాబ్’ నుంచి కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ ఫ్యాంటసీ హారర్ కామెడీ చిత్రంలో మాళవికా మోహనన్, నిధీ అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, కృతీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 9న విడుదల కానుంది.
ఇక ఈ సినిమా కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలోని పీరియాడికల్ సినిమా ‘ఫౌజి’లో ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. ఇంకా ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించనున్న ‘స్పిరిట్’ చిత్రం త్వరలోనే సెట్స్‌కు వెళ్లనుంది. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లోని ‘కల్కి 2’ (‘కల్కి 2898 ఏడీ’ సీక్వెల్) చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ్రపారంభం కానుంది. అలాగే ప్రముఖ కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్‌తో ప్రభాస్ మూడు కొత్త సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాలకు ఎవరు దర్శకత్వం వహిస్తారనే విషయంపై త్వరలో ఓ స్పష్టత రానుంది. ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నారు ప్రభాస్.
Tags : 1