తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం
Breaking News
ఆడి క్యూ3, క్యూ5 లిమిటెడ్ ఎడిషన్
Published on Tue, 11/11/2025 - 08:00
జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి.. క్యూ3, క్యూ5 సిగ్నేచర్ లైన్ కార్లు ఆవిష్కరించింది. అయిదు ఎక్స్టీరియర్ రంగుల్లో లభ్యమయ్యే ఈ రెండు మోడళ్లు పరిమితంగా లభించనున్నాయి. డ్రమటిక్ వెల్కం ప్రొజెక్షన్ కోసం ఆడి రింగ్స్ ఎంట్రీ ఎల్ఈడీ ల్యాంపులు అమర్చారు. బ్రాండ్ గుర్తింపు పెంచేలా విలక్షణమైన ఆడి రింగ్స్ డెకాల్స్, డైనమిక్ వీల్ హబ్ క్యాప్‌లు, బెస్పోక్ క్యాబిన్ వాతావరణం కోసం ఫ్రాగ్రన్స్ డిస్పెన్సర్ జోడించారు.
మెటాలిక్ కీ కవర్ ప్రీమియం టచ్ అనుభూతినిస్తుంది. స్పోర్టీ ఇంటీరియర్ యాక్సెంట్‌ను అందించే స్టెయిన్లెస్ స్టీల్ పెడల్ కవర్లు ఉన్నాయి. ఆడి క్యూ3 ధర రూ.52.31 లక్షలు, ఆడి క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ ధర రూ.53.55 లక్షలు, ఆడి క్యూ5 ధర రూ.69.86 లక్షలుగా నిర్ణయించారు. ‘‘భారత్‌లో ఆడి క్యూ3, ఆడి క్యూ5 మోడళ్లు ఆడి ‘క్యూ’ పోర్ట్‌ఫోలియోకు మూలస్తంభాలు ఉన్నాయి. ఈ సిగ్నేచర్ లైన్‌తో రిఫైన్డ్ పనితీరు, అధునాతన ఫీచర్లను అందిస్తున్నాము’’ అని ఆడి ఇండియా అధిపతి బల్బీర్ సింగ్ ధిల్లాస్ తెలిపారు.
ఇదీ చదవండి: డిసెంబర్ నాటికి బంగారం ధరలు ఇలా..
Tags : 1