విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..

Published on Mon, 11/10/2025 - 19:32

ఒకప్పుడు లగ్జరీ లైఫ్ అనుభవించి.. అప్పులపాలైపోయిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా గురించి బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. అయితే అతి తక్కువ కాలంలో ప్రపంచ స్థాయి సేవలను అందించిన ఈ సంస్థ ఎందుకు కుప్పకూపీలిపోయింది?, విజయ్ మాల్యా ఎందుకు విదేశాలకు పారిపోయారు అనే విషయాలు చాలామందికి తెలుసుండక పోవచ్చు. ఈ కథనంలో ఆ వివరాలు..

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్
యూబీ గ్రూప్ బాస్ అయిన విజయ్ మాల్యా.. కింగ్‌ఫిషర్ బీర్, మెక్‌డోవెల్స్ అనే ప్రముఖ మద్యం బ్రాండ్స్ కూడా నిర్వహిస్తూ, రాజభోగాలు అనుభవించేవారు. 2005లో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ పేరుతో విమానయాన సేవలు ప్రారంభించారు. ఇది అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయింది. విమానాల్లో లగ్జరీ సౌకర్యాలు, గ్లామర్ ప్రమోషన్స్, మోడల్-హోస్టెస్లతో.. ఎయిర్‌లైన్స్ గ్లామర్ బ్రాండ్‌గా నిలిచింది.

డెక్కన్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు
లగ్జరీ సౌకర్యాలు అందించడం వల్ల.. ఆపరేటింగ్ ఖర్చులు భారీగా పెరిగాయి. ఇదే సమయంలో ఇంధన ధరలు పెరగడం.. జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో, స్పైస్‌జెట్‌ వంటి సంస్థలు తక్కువ ధరలకే టికెట్స్ విక్రయించడం వల్ల కింగ్‌ఫిషర్ నష్టాలను చూడాల్సి వచ్చింది. 2008లో డెక్కన్ ఎయిర్‌లైన్స్ కొనుగోలు చేయడం కూడా కంపెనీ(కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్)పై పెద్ద భారాన్ని మోపింది. దీంతో సంస్థలు ఆదాయం తగ్గిపోయింది. అప్పులు పెరిగిపోయాయి.

పెరిగిన అప్పు
2012 నాటికి విజయ్ మాల్యా సారథ్యంలో ఉన్న ఎయిర్‌లైన్ అప్పు ఏకంగా రూ. 9000 కోట్లకు చేరింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన తన ఉద్యోగులకు కూడా జీతాలు ఇవ్వలేకపోయారు. ఆదాయ మార్గాలు కనిపించలేదు. దీంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కంపెనీ లైసెన్స్ రద్దు చేసింది. ఆ తరువాత కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడింది.

కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మూతపడటంతో.. బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పును చెప్పించలేకపోయారు. దీంతో విజయ్ మాల్యాపై బ్యాంక్ మోసం, మనీ లాండరింగ్ కేసులు నమోదయ్యాయి. ఇక చేసేదేమీ లేక 2016లో భారతదేశం వదిలి యూకే వెళ్లిపోయారు. అయితే భారత ప్రభుత్వం ఈయనను మళ్లీ దేశానికి రప్పించడానికి ఎక్స్‌ట్రడిషన్ కేసు వేసింది.

ఇదీ చదవండి: 2019లో భర్తకు విడాకులు.. ఆరేళ్లుగా లక్షల కోట్లు విరాళం

Videos

నువ్వే పెద్ద కల్తీ.. సుప్రీం తిట్టినా బుద్ధి మారదా!

Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్

ఏపీ ఇక సూడాన్.. 17 నెలల్లో బాబు చేసిన అప్పు

షుగర్ పేషెంట్స్ కు రియల్ గుడ్ న్యూస్

తెలంగాణలో మరో బస్సు ప్రమాదం

ఉగ్రవాదుల అరెస్ట్.. మరుసటి రోజే బాంబు బ్లాస్ట్..

ఢిల్లీలో భారీ పేలుడు.. హైదరాబాద్ హై అలర్ట్

బాంబు బ్లాస్ట్ పై అమిత్ షా ఫస్ట్ రియాక్షన్

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Photos

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)