Breaking News

30 ఏళ్లుగా ఇదే పని: ఇష్టమొచ్చినట్టు గడుపుతా..

Published on Sun, 11/09/2025 - 20:35

ఉద్యోగం చేసే చాలామంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవడంలో సతమతమైపోతుంటారు. కానీ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ మాత్రం 30 ఏళ్లుగా రొటీన్ విధానం పాటిస్తూ.. ఎంత క్లిష్టమైన పరిస్థితులు వచ్చినా.. ప్రతి మంగళవారం సాయంత్రం 5 గంటలకు పనికి ఆపేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

వారంలో ఒకరోజు పని మానేసి.. సన్నిహితులతో కాలం గడపడం, సినిమాలు చూడటం, నచ్చిన ఫుడ్ బయటే తినేయడం వంటివి చేస్తానని వెల్లడించారు. ఈ సమయంలో ఎంతటి ముఖ్యమైన కాల్స్, మీటింగ్స్ కూడా పెట్టుకోనని పేర్కొన్నారు. దీనిని 30 సంవత్సరాలుగా పాటిస్తూనే ఉన్నానని మార్క్ రాండోల్ఫ్ చెప్పారు.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మానసిక ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పెంపొందిస్తుందని మార్క్ చెబుతారు. పని ముఖ్యమే అయినప్పటికీ.. మనకోసం, కుటుంబం కోసం కూడా కొంత సమయం కేటాయించుకోవాలి. ఎంతోమంది దిగ్గజ సీఈఓలు వర్క్ లైఫ్ బిజీగా ఉన్న సమయంలో మార్క్ రాండోల్ఫ్ మాటలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.

నిజానికి ఈ ట్వీట్ ఏప్రిల్ 7న చేసినప్పటికీ.. ఇప్పటికే ట్రెండ్ అవుతూనే ఉంది. కొంతమంది మార్క్ రాండోల్ఫ్ మాటలతో ఏకీభవించినప్పటికీ.. కొందరు సీఈఓలు మాత్రమే కొట్టిపారేస్తున్నారు. సక్సెస్ సాధించాలంటే ఎక్కువ గంటలు పని చేయాల్సిందే అని చెబుతున్నారు.

ఇదీ చదవండి: బంగారం: ఇప్పుడు కొనాలా.. ఇంకొన్ని రోజులు వేచి చూడాలా?

Videos

Religious Leader: మీ హస్తం లేకుండానే గోవుల అక్రమ రవాణా జరుగుతుందా?

Ambati: ఆ భగవంతుడు వదలడు

Sailajanath: చంద్రబాబు మీ కళ్ళు తెరిపించేందుకే ఈ సంతకాల సేకరణ

Cotton Farmers: నల్లగొండ- దేవరకొండ రహదారిపై ఎడ్లబండ్లతో నిరసన

అందెశ్రీ మృతి పట్ల సీఎం రేవంత్, కేసీఆర్ దిగ్భ్రాంతి

తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ర్యాగింగ్ వివాదం

టికెట్ ఇప్పిస్తానని వేమన సతీష్ రూ.7 కోట్లు తీసుకున్నారు: సుధా మాధవి

Ambati: దేవుడితో రాజకీయాలు చేయడం టీడీపీకి అలవాటే

శ్రీ చైతన్య స్కూల్ లో మరో బాలిక ఆత్మహత్య...

కేంద్ర బలగాలు, 5000 మంది పోలీసులు ప్రత్యేక డ్రోన్లతో నిఘా..

Photos

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)

+5

ట్రెండింగ్ లో రామ్ చరణ్ 'చికిరి చికిరి' పాట డ్యాన్స్ (ఫొటోలు)

+5

ఏపీలో సందడి సందడిగా వనభోజనాలు (ఫొటోలు)

+5

కడప : పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాల్లో నటులు సుమన్‌, అలీ (ఫొటోలు)

+5

ఘనంగా ప్రారంభమైన ‘ఇరువురు భామల కౌగిలిలో’ చిత్రం (ఫొటోలు)

+5

కార్తీక సోమవారం శోభ.. ఉదయాన్నే ఆలయాలకు పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

ఏఆర్ రెహమాన్ కన్సర్ట్‌లో 'పెద్ది' టీమ్ సందడి (ఫొటోలు)