ఓటీటీలో 'తెలుసు కదా' మూవీ.. అఫీషియల్ ప్రకటన

Published on Sun, 11/09/2025 - 08:52

టాలీవుడ్‌ నటుడు సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా తెలుసు కదా ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. దర్శకులు నీరజ కోన తెరకెక్కించిన ఈ చిత్రం అక్టోబర్‌ 17న విడుదలైంది. అయితే, అనుకున్నంత రేంజ్‌లో ప్రేక్షకులను మెప్పించలేదు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టి.జి.విశ్వప్రసాద్, కృతిప్రసాద్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో  రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి , వైవా హర్ష నటించారు.

ముక్కోణ‌పు ప్రేమ‌క‌థగా తెరకెక్కిన తెలుసు కదా చిత్రం ఓటీటీలో విడుదల కానుంది. నవంబర్‌ 14 నుంచి  స్ట్రీమింగ్‌ అవుతుందని అప్‌కమింగ్‌ చిత్రాల జాబితాలో నెట్‌ఫ్లిక్స్‌(Netflix) పేర్కొంది. సినిమా విడుదలైన నెలరోజుల్లోనే ఓటీటీలోకి రావడం విశేషం. తెలుసు కదా మూవీని సుమారు రూ. 50 కోట్ల బడ్జెట్‌తో రూపొందించారని టాక్‌. అయితే, బాక్సాఫీస్‌ వద్ద రూ. 12 కోట్ల మేరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కానీ,  ఈ సినిమా ఓటీటీ రైట్స్ సుమారుగా 15 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆపై శాటిలైట్ రైట్స్ రూ. 5 కోట్లతో పాటు మ్యూజిక్ రైట్స్  కోటి వరకు బిజినెస్‌ చేయడంతో కాస్త మేరకు నష్టాలు తగ్గినట్లు తెలుస్తోంది.

కథేంటంటే..
స్టార్ హోటల్ లో చీఫ్ చెఫ్‌గా పనిచేసే వరుణ్ కుమార్(సిద్దు) అనాథ. కాలేజీ డేస్‌లో లవ్‌ బ్రేకప్‌ అవ్వడంతో అమ్మాయిలను ఎంత వరకు ప్రేమించాలనే విషయంలో క్లారిటీతో ఉంటాడు. భార్య, పిల్లలతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు. మ్యాట్రిమొనీ ద్వారా అంజలి(రాశి ఖన్నా)ని పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి పిల్లలు అంటే చాలా ఇష్టం. కానీ పెళ్లి తర్వాత అంజలికి పిల్లలు పుట్టరనే విషయం తెలుస్తుంది. కొన్నాళ్ల తర్వాత డాక్టర్‌ రాగా(శ్రీనిధి శెట్టి) ద్వారా సరోగసీతో తల్లి కావొచ్చనే విషయం అంజలికి తెలుస్తుంది. బిడ్డను మోసేందుకు డాక్టర్‌ రాగా ముందుకు వస్తుంది.

కట్‌ చేస్తే.. కాలేజీ డేస్‌లో వరుణ్‌ ప్రేమించిన అమ్మాయినే డాక్టర్‌ రాగా. ఈ విషయం తెలిసి కూడా రాగా తన బిడ్డను మోసేందుకు ఒప్పుకుంటాడు వరుణ్‌. ఈ ముగ్గురు కలిసి ఒకే ఇంట్లో ఉంటారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు రాగా-వరుణ్‌ బ్రేకప్‌కి కారణం ఏంటి? తనను వదిలేసి వెళ్లిపోయిన రాగా పట్ల ఎంతో కోపం పెంచుకున్న వరుణ్‌.. ఆమె తన బిడ్డను మోసేందుకు ఎందుకు ఒప్పుకున్నాడు? రాగా-వరుణ్‌ల విషయం అంజలికి తెలిసిందా లేదా? మాజీ ప్రేయసి ఒకవైపు.. కట్టుకున్న భార్య మరోవైపు.. ఇద్దరి మధ్య వరుణ్‌కి ఎదురైన సమస్యలు ఏంటి? వరుణ్‌ కోరుకున్నట్లుగా చివరకు తండ్రి అయ్యాడా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Videos

సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!

పశువులను చంపి.. పిఠాపురంలో నకిలీ నెయ్యి కలకలం

జోగి రమేష్ త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారు

న్యాయం అడిగితే కేసులు పెడతారా ? అండగా ఉన్న అందరికీ ధన్యవాదాలు

ఏపీలో ఫ్రీ బస్సు పథకానికి మంగళం?

ఇదీ నా కాలే.. అదీ నా కాలే.. లైవ్ లో ఇచ్చిపడేసిన RGV

జల్సా టైటిల్ కరెక్ట్ గా సరిపోద్ది.. అధికారం ఏపీలో కానీ..

ప్రభుత్వ వైద్యానికి చంద్రగ్రహణం

చేపల వర్షం..ఇదేందయ్యా, ఇది!

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు

Photos

+5

చీరలో కిక్‌ ఇచ్చే ఫోజులతో బిగ్‌బాస్‌ 'అశ్విని శ్రీ ' (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : పెట్‌ షో అదరహో (ఫొటోలు)

+5

అను ఇమ్మాన్యుయేల్ 'ద గర్ల్‌ఫ్రెండ్' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

ఫ్రెండ్ పెళ్లిలో అనన్య సందడే సందడి (ఫొటోలు)

+5

'జగద్ధాత్రి' సీరియల్ హీరోయిన్ దీప్తి పెళ్లి (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో రోజా, ప్రియ (ఫోటోలు)

+5

వీకెండ్‌ స్పెషల్‌.. హైదరాబాద్‌ సమీపంలోని బెస్ట్‌ పిక్నిక్ స్పాట్‌లు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టీమిండియా టీ20 మ్యాచ్‌లో కాజల్ అగర్వాల్ సందడి (ఫొటోలు)

+5

ముద్దమందారం అంతా క్యూట్‌గా బ్రిగిడ (ఫొటోలు)