సాక్షి సాక్షిగా.. నాగార్జునకు ఇచ్చే వెళ్తా..!
Breaking News
డిజిటల్ గోల్డ్‌తో జాగ్రత్త.. సెబీ హెచ్చరిక
Published on Sun, 11/09/2025 - 08:36
డిజిటల్ గోల్డ్‌ను విక్రయించే సంస్థలు, ఆయా ఉత్పత్తులు నియంత్రణ పరిధిలో లేవని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ తెలిపింది. కాబట్టి, డిజిటల్ గోల్డ్ కొనుగోలు చేయడం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమని, జాగ్రత్త వహించాలని హెచ్చరించింది. సెబీ నియంత్రించే పసిడి ఉత్పత్తులతో పోలిస్తే ఇవి భిన్నమైనవని పేర్కొంది.
డిజిటల్ గోల్డ్ లేదా ఈ–గోల్డ్ ప్రోడక్టుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ యంత్రాంగంపరమైన హామీ ఉండబోదని వివరించింది. ప్రస్తుతం పసిడికి డిమాండ్ భారీగా పెరగడం, ఆన్‌లైన్‌లో అత్యంత తక్కువగా రూ. 10 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చంటూ పలు సంస్థలు ఊరిస్తుండటం తదితర పరిణామాల నేపథ్యంలో సెబీ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది.
ఎక్స్ఛేంజీల్లో ట్రేడయ్యే కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్ట్‌లు, గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్), ఎల్రక్టానిక్ గోల్డ్ రిసీట్స్ మొదలైన సాధనాల ద్వారా నియంత్రణ సంస్థ పరిధిలో పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయని సెబీ తెలిపింది.
ఏమిటీ గోల్డ్ ఈటీఎఫ్‌లు?
గోల్డ్ ఈటీఎఫ్‌లు బంగారంపై పెట్టుబడి పెట్టే డిజిటల్ మార్గం. ఇవి భౌతిక బంగారాన్ని కొనకుండా, స్టాక్ మార్కెట్ ద్వారా బంగారం ధరలపై పెట్టుబడి పెట్టే అవకాశం కల్పిస్తాయి. గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF) అంటే గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్. ఇది మ్యూచువల్ ఫండ్‌ల తరహాలో పనిచేస్తుంది. ఇది స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడయ్యే ఒక ఫండ్. బంగారం ధరల ఆధారంగా దీని విలువ మారుతూ ఉంటుంది. దీంతో భౌతిక బంగారం కొనకుండా డిజిటల్ రూపంలో బంగారంపై పెట్టుబడి పెట్టవచ్చు.
ముఖ్యమైన ప్రయోజనాలు
భౌతిక బంగారానికి ఉన్న భద్రతా సమస్యలు గోల్డ్ ఈటీఎఫ్‌లకు ఉండవు.
స్టాక్ మార్కెట్‌లో ఎప్పుడైనా కొనుగోలు లేదా అమ్మకం చేయవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్‌లపై తక్కువ మొత్తాలతో కూడా పెట్టుబడి ప్రారంభించవచ్చు.
లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తిస్తుంది. ఇది మ్యూచువల్ ఫండ్‌లకు సమానం.
భౌతికంగా నిల్వ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టోరేజ్ ఖర్చులు ఉండవు.
పెట్టుబడి ఎలా పెట్టాలంటే..
గోల్డ్ ఈటీఎఫ్‌లపై పెట్టుబడి పెట్టాలంటే డీమాట్ ఖాతా (Demat Account) అవసరం. స్టాక్ బ్రోకర్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్‌లు కొనుగోలు చేయవచ్చు. నిర్దిష్ట ఏఎంసీ అంటే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు ఈ ఫండ్లను నిర్వహిస్తాయి.
Tags : 1