Breaking News

విశ్వవిజేతలకు టాటా మోటార్స్ అదిరిపోయే గిఫ్ట్!

Published on Thu, 11/06/2025 - 17:37

ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ గెలిచిన ఇండియా ఉమెన్స్ టీమ్.. ప్రస్తుతం సంబరాల్లో మునిగిపోయింది. ఈ తరుణంలో టాటా మోటార్స్ వారికి ఒక గుడ్ న్యూస్ చెప్పింది. జట్టులోని సభ్యులకు ఒక్కొక్కరికి.. ఒక్కో సియెర్రా కారును గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

టాటా మోటార్స్.. తన సియెర్రా కారును నవంబర్ 25న దేశీయ విఫణిలో లాంచ్ చేయనుంది. ఇప్పటికే ఈ కారు టెస్టింగ్ సమయంలో చాలాసార్లు కనిపించింది. ఇది 5 డోర్స్ మోడల్. కాబట్టి కుటుంబ ప్రయాణాలకు ఇది చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కారు పనోరమిక్ సన్‌రూఫ్, కనెక్టెడ్ ఎల్ఈడీ టెయిల్‌లైట్స్, సొగసైన డోర్ హ్యాండిల్స్ పొందుతుంది.

టాటా సియెర్రా.. మూడు స్క్రీన్ లేఅవుట్‌తో కూడిన డ్యాష్‌బోర్డ్ పొందుతుంది. ఇందులో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్, ఇన్ఫోటైన్‌మెంట్ కోసం సెంట్రల్ టచ్‌స్క్రీన్, ముందు ప్రయాణీకుడి కోసం అదనపు స్క్రీన్ వంటివి ఉన్నాయి. సరికొత్త స్టీరింగ్ వీల్ కూడా పొందుతుంది. ఈ కారు పసుపు, ఎరుపు రంగుల్లో అమ్మకానికి రానున్నట్లు సమాచారం. ఈ కారు ధరను కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. కానీ దీని ప్రారంభ ధర రూ. 15 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని అంచనా.

ఇదీ చదవండి: హీరో ఎలక్ట్రిక్ కారు: నానో కంటే చిన్నగా!

టాటా సియెర్రా యొక్క పవర్‌ట్రెయిన్ గురించి.. కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఇది పెట్రోల్ & డీజిల్ ఇంజిన్‌ ఎంపికలతో లభించనుంది. అయితే ప్రస్తుతం హారియర్ & సఫారీ మోడళ్లలోని 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌, 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ ఎంపికలే.. సియెర్రాలో కూడా ఉంటాయని సమాచారం. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో మాన్యువల్ & ఆటోమేటిక్ ఉండనున్నాయి.

Videos

Tirupati District: భారీ వర్షంతో పొంగిన వాగు విద్యార్థుల అష్టకష్టాలు

విద్యుత్ ఉద్యోగిపై TDP నేత రంగారెడ్డి బూతులు

Tirupati: అంధకారంలో గ్రామాలు వరదలో కొట్టుకుపోయిన పశువులు

జగన్ ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ అమలు చేయాల్సిందే

KSR Live Show: క్రెడిట్ దొంగ

చంద్రబాబు గుండెల్లో బుల్లెట్ ట్రైన్లు కరకట్టపై యాంకర్ ఈశ్వర్ సంచలన నిజాలు

బీహార్ లో రికార్డు స్థాయిలో ఓటింగ్... ఓటర్లకు కృతజ్ఞతలు తెలియజేసిన సీఈసీ జ్ఞానేశ్ కుమార్

KGH: విద్యుత్ సరఫరా నిలిచిపోయి పనిచేయని వైద్య పరికరాలు

భారీ పెట్టుబడి ప్రతిపాదనకు ఆమోదం తెలప డానికి సిద్ధం

రోడ్డు ప్రమాదాల్లో ఏటా ఇన్ని లక్షల మంది చనిపోతున్నారా?

Photos

+5

చీరలో చందమామే.. అందరి చూపులు తనపైనే! (ఫోటోలు)

+5

'సంతాన ప్రాప్తిరస్తు' ట్రైలర్‌ ఈవెంట్‌లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

కాంత ట్రైలర్‌ లాంచ్‌.. ఒకే వేదికపై దుల్కర్‌, రానా (ఫోటోలు)

+5

ఎన్నికల వేళ అరుదైన చిత్రాలు.. బిహార్‌ ఓటర్ల ప్రత్యేక (ఫొటోలు)

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)