Breaking News

ఎవరినీ ఉద్దేశించి అనలేదు.. క్షమించండి: బండ్ల గణేశ్‌

Published on Wed, 11/05/2025 - 15:27

ప్రముఖ నిర్మాత బండ్ల గణేశ్‌ (Bandla Ganesh) మరోసారి క్షమాపణలు చెప్పాడు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ట్వీట్‌ చేశాడు. కె-ర్యాంప్‌ సినిమా సక్సెస్‌ మీట్‌లో నేను మాట్లాడిన మాటలు కొందరిని బాధపెట్టాయని తెలిసింది. నేను ఎవరినీ ఉద్దేశించి మాట్లాడలేదు. నా ఉద్దేశం అందరూ బాగుండాలి, కళామాత ఆశీస్సులతో అందరం పైకి రావాలని మాత్రమే. ఎవరైనా బాధపడి ఉంటే  క్షమాపణలు అని రాసుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే?
కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన 'K ర్యాంప్' సినిమా దీపావళికి రిలీజైంది. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవడంతో ర్యాంపేజ్‌ బ్లాక్‌బస్టర్‌ సెలబ్రేషన్స్‌ పేరిట సోమవారం ఓ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్‌ ఈవెంట్‌కు బండ్ల గణేష్‌ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. టాలెంట్‌ను నమ్ముకుని పైకి వస్తున్న కిరణ్‌ అబ్బవరాన్ని పొగిడే క్రమంలో తెలుగులోని ఓ స్టార్‌ హీరోను కింపరిచేలా కామెంట్స్‌ చేశాడు. బండ్ల గణేశ్‌ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజ్‌ ప్యాంట్లు, కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని.. కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ పోజులు కొడుతున్నారు.

విజయ్‌పైనే విమర్శలు
తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్‌ను తీసుకురా... అనిల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్‌ పరిచయం చేశాడు' అని ఎలివేషన్‌ ఇచ్చాడు. ఇండస్ట్రీలో విజయ్‌ దేవరకొండ (Vijay Devarakonda) మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్.. వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటాడు. దీంతో బండ్ల.. విజయ్‌పైనే విమర్శలు గుప్పించాడని ప్రచారం జరిగింది. కిరణ్‌ను పొగడటం తప్పు కాదు కానీ మధ్యలో విజయ్‌ ఏం పాపం చేశాడని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలోనే బండ్ల క్షమాపణలు చెప్తూ ట్వీట్‌ చేశాడు.

 

Videos

ACB రైడ్స్.. బయటపడ్డ కూటమి అవినీతి బాగోతాలు

దద్దరిల్లుతున్న పెద్ది సాంగ్ ప్రోమో.. దుమ్మురేపుతున్న రామ్ చరణ్ డాన్స్

YSRCP మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుకు గుండెపోటు

అజారుద్దీన్ పై కాంగ్రెస్ మహిళ నేత షాకింగ్ కామెంట్స్..

పవన్ నీ సొల్లు కబుర్లు ఆపు.. లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చిన జడ శ్రవణ్

రాసిపెట్టుకో ఈశ్వర్.. రేవంత్ కథ అక్కడే ముగుస్తుంది

అంతుచిక్కని రహస్యం.. విశ్వంలో ఓ భారీ ఆకారం కదలిక

పులివెందులలో మెడికల్ కాలేజీ లేకుండా చేయాలి..!

అంబేద్కర్ విగ్రహంపై రెడ్ బుక్ రాజ్యాంగం

బీహార్ తొలి విడత పోలింగ్ ప్రారంభం

Photos

+5

#KotiDeepotsavam : ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కోటి దీపోత్సవం (ఫొటోలు)

+5

విష్ణు విశాల్‌ ’ఆర్యన్‌‘ మూవీ ప్రీ రిలీజ్‌ (ఫొటోలు)

+5

ప్రధాని మోదీని కలిసిన విశ్వ విజేతలు (ఫొటోలు)

+5

రష్మికా ‘ది గర్ల్‌ ఫ్రెండ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

పెళ్లి ఫోటోలు షేర్‌ చేసిన నారా రోహిత్ (ఫోటోలు)

+5

తిరుమలలో బుల్లితెర నటుడు ప్రభాకర్‌ (ఫోటోలు)

+5

వేయి స్తంభాల దేవాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు (ఫోటోలు)

+5

జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలు.. సింగర్‌ ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

గ్రీన్ లెహంగాలో మెరిసిపోతున్న అత్తారింటికి దారేది హీరోయిన్ ప్రణీత.. ఫోటోలు