బాబుకు హైకోర్టు బిగ్ షాక్.. జోగి రమేష్ దెబ్బ అదుర్స్..!
Breaking News
ఆ పేపర్ బాయ్ స్కిల్‌కి మాటల్లేవ్ అంతే..!
Published on Tue, 11/04/2025 - 17:11
ప్రతి ఒక్కరి ఏదో ఒక దాంట్లో అపారమైన నైపుణ్యం ఉంటుంది. అయితే దాన్ని ఎవరో గుర్తించి అంటే గానీ వాళ్లకూడా అంతగా పట్టించుకోరు. అలాంటి సంఘటన ఇక్కడ చోటు చేసుకుంది.
దీప్ అనే పేపర్ బాయ్ న్యూస్‌పేపర్ డెలివరీ చేయు విధానం చూస్తే మతిపోతుంది. అబ్బా ఏం స్కిల్ ఇది..అని అనుకుండా ఉండలేరు. అతడు పేపర్ విసిరే విధానం..అవి నేరుగా వాళ్ల వాకిళ్లు లేదా గుమ్మాల్లోనూ, అక్కడ మనుషుల చేతుల్లోకి సరాసరి వెళ్లిపోతుండటం ఓ మ్యాజిక్‌లా జరిగిపోతుంది.
ఎక్కడ మిస్ అయ్యే ఛాన్స్ లేదన్నట్లుగా వెళ్లిపోతున్నాయి. అరే ఏం టెక్నిక్ ఇది అనిపిస్తుంది. అతడు అలా న్యూస్ పేపర్లను డెలివరి చేస్తున్నంత సేపు కళ్లు తిప్పుకోలేం కూడా. అంతలా చాకచక్యంగా స్కూటర్‌పై స్పీడ్‌గా వెళ్లిపోతూ వేసుకుంటూ వెళ్లిపోతుంటాడు. ఎక్కడ పొరబాటు, తడబాటు జరగకపోవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ఎయిర్ ఇండియా ప్రమాద మృత్యుంజయడు: ఆ రోజు అతను బతకడం ఓ అద్భుతం..కానీ ఇప్పుడు ప్రతిక్షణం..)
Tags : 1