'ఫౌజీ'లో జూనియర్‌ ప్రభాస్‌గా ప్రముఖ హీరో కుమారుడు ఎంట్రీ

Published on Tue, 10/28/2025 - 10:30

ప్రభాస్‌ (Prabhas) హీరోగా నటిస్తున్న 'ఫౌజీ' (Fauji) సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి (Hanu Raghavapudi) తెరకెక్కిస్తున్నా ఈ చిత్రాన్ని  మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో కన్నడ బ్యూటీ  'చైత్ర జె ఆచార్‌' (Chaithra J Achar)కు ఛాన్స్‌ దక్కినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇదే సమయంలో నటుడు సుధీర్ బాబు రెండో కుమారుడు దర్శన్‌ ఫౌజీ మూవీతో ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ వార్త నెట్టింట వైరల్‌ అవుతుంది.

సుధీర్ బాబు కుమారుడు, మహేష్‌ బాబు మేనల్లుడు దర్శన్‌కు ఫౌజీలో ఛాన్స్‌ వచ్చినట్లు టాక్‌. ఇందులో ప్రభాస్‌ చిన్నప్పటి పాత్రలో అతను కనపించనున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు మహేష్‌ బాబు నిర్మిస్తున్న గూఢచారి-2లో కూడా దర్శన్‌ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారని టాక్‌ ఉంది. అయితే, ఈ వార్తల గురించి ఫౌజీ యూనిట్‌, సుధీర్ బాబు కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. ఈ వార్తలు నిజమేనా అని తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇప్పటికే సుధీర్ బాబు తన పెద్ద కొడుకు చరిత్ మానస్ను వెండితెరకు పరిచయం చేశారు. ఆయన హీరోగా నటించిన చిత్రం 'మోసగాళ్లకు మోసగాడు'లో కూడా ఓ చిన్న పాత్రలో చరిత్ నటించారు. గతంలో తను పలు సినిమాల్లో మెరిశాడు. భలే మగాడివోయ్​ సినిమాలో జూనియర్​ నానిగా కనిపించి మెప్పించాడు. ఆ తర్వాత  విన్నర్​ సినిమాలో జూనియర్​ సాయిధరమ్​ తేజ్‌గా కనిపించాడు. కాగా మహేష్ బాబు తనయుడు  గౌతమ్ కూడా '1 నేనొక్కడినే' చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు సుదీర్‌ బాబు రెండో కుమారుడు దర్శన్‌ ఏకంగా ప్రభాస్‌  పాన్‌ ఇండియా చిత్రంతో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
 

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు