Breaking News

హన్సిక ట్రిప్‌.. ఎవరితో తెలుసా..?

Published on Tue, 10/28/2025 - 06:26

దక్షణాదిన ఒకప్పుడు క్రేజీ కథానాయకిగా వెలిగిన నటి హన్సిక. తెలుగు, తమిళం, హిందీ ఇలా పలు భాషల్లో 50 చిత్రాలకు పైగా నటించిన ఈ ముంబయి భామ ఆ మధ్య  సోహైల్‌ కతూరియా అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఏ ఒక్క కొత్త చిత్రంలోనూ నటించలేదు. అయినప్పటికీ నిత్యం వార్తల్లో ఉంటున్నారు. ఇటీవల భర్తతో వివాదాలు అంటూ ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యింది. దానికి బలం చేకూర్చే విధంగా నటి హన్సిక ఇటీవల దీపావళి పండగను ఒంటరిగానే  జరుపుకోవడం, వివాహం అయిన రెండేళ్లలోనే భర్తను విడిచి తల్లితోనే ఉంటున్నట్లు ప్రచారం జోరందుకుంది. 

ఈ ప్రచారంపై హన్సిక ఇప్పటి వరకూ నోరు మెదపలేదు. కాగా తాజాగా ఈ అమ్మడు రాజస్థాన్‌లోని రంతంబోర్‌ జాతీయ పార్క్‌ను తిలకించడానికి వెళ్లారు. అయితే ఆమె ఎవరితో కలిసి వెళ్లారో తెలుసా అమ్మ, సోదరుడితో కలిసి ఆ పార్క్‌కు వెళ్లారు. అక్కడ పులి, కుందేలు, ఎలుగుబంటులతో ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇక్కడ విషయం అదికాదు. ఆ పార్క్‌కు హన్సిక తన తల్లి, సోదరుడితో కలిసి వెళ్లడమే  ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కారణం ఈసారి కూడా భర్త ఆమెతో లేకపోవడమే.  

దీంతో హన్సిక, సోహైల్‌ కతూరియా మధ్య వివేధాలు అనే ప్రచారం నిజమేనని అర్థమవుతోందంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు. అదే విధంగా హన్సిక తన సోదరుడి భార్యను గృహ హింసకు గురి చేసిందే ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఓ టాప్‌ హీరోయిన్‌ ఇలాంటి వివాదాలకు తావు ఇవ్వడంతో హన్సిక పేరు వార్తల్లో నానుతోంది. అయితే ఇలాంటివన్నీ లెక్క చేయని ఈ అమ్మడు విహార యాత్రలు చేస్తూ ఎంజాయ్‌ చేస్తున్నారు.  

Videos

అంబాలా ఎయిర్ బేస్ లో రాష్ట్రపతి ముర్ము సాహసం!

భారీ గాలులతో వర్షాలు.. హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక

Montha Cyclone : వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందించిన గంగుల బ్రిజేంద్ర రెడ్డి

APSRTCపై మోంథా పంజా.. ప్రయాణికుల కష్టాలు

డ్రగ్స్ మాఫియాపై ఎటాక్.. 64 మంది మృతి..

Montha Cyclone: 60 ఏళ్ల వయసులో ఇలాంటి ఉప్పెన చూడలేదు

బాబు వద్దనుకున్న గ్రామ సచివాలయ సిబ్బందే కీలక పాత్ర పోషించారు..

Jains Nani: ప్రొడ్యూసర్ వాళ్ళని తిట్టడంలో తప్పు లేదు

టీడీపీ నేతల అక్రమ మైనింగ్ ని బయటపెట్టిన శైలజానాథ్

ఆసీస్ తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో భారీ మార్పు

Photos

+5

ఒంటరిగా మాల్దీవులు టూర్‌లో నమ్రత (ఫొటోలు)

+5

నా ప్రేమ ఈ రోజే పుట్టింది! లవ్‌ లేడీకి లవ్లీ గ్రీటింగ్స్‌ (ఫొటోలు)

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)