రైల్వే కాలనీ డేట్‌ ఫిక్స్‌

Published on Tue, 10/28/2025 - 00:41

‘అల్లరి’ నరేశ్‌ హీరోగా రూపొందిన ‘12ఎ రైల్వే కాలనీ’ థియేటర్లో కనిపించే తేదీ ఖరారైపోయింది. నాని కాసరగడ్డని దర్శకుడిగా పరిచయం చేస్తూ, పవన్‌కుమార్‌ సమర్పణలో శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పొలిమేర, పొలిమేర 2’ చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచుకున్న డా. అనిల్‌ విశ్వనాథ్‌ ఈ చిత్రా నికి షో రన్నర్‌గా వ్యవహరించి, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ అందించారు.

ఈ చిత్రం విడుదల తేదీని ఖరారు చేసిన విషయాన్ని ప్రకటించి, స్పెషల్‌ వీడియోను, ΄పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ‘‘నవంబరు 21న ప్రపంచవ్యాప్తంగా మా ‘12ఎ రైల్వే కాలనీ’ని విడుదల చేయనున్నాం. ఆ వారంలో వేరే పెద్ద రిలీజులు లేకపోవడం బాక్సాఫీస్‌ వద్ద మా సినిమాకి అనుకూలంగా ఉంటుంది. ఈ చిత్రంలో ‘అల్లరి’ నరేశ్‌ చేసినపాత్రలో పలు కోణాలున్నాయి’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు. ‘పొలిమేర’ సిరీస్‌లో ఆకట్టుకున్న డా.  కామాక్షి భాస్కర్ల  హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో. కెమెరా: కుశేంద్ర రమేశ్‌ రెడ్డి. ’
 

Videos

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

కూలిన భారీ వృక్షాలు.. మునిగిన రోడ్లు, పంట పొలాలు

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు