స్టార్ హీరో తనయుడి మిస్టరీ థ్రిల్లర్‌.. తెలుగులోనూ రిలీజ్

Published on Mon, 10/27/2025 - 20:26

మలయాళ  స్టార్ మోహన్ లాల్ తనయుడిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ప్రణవ్. హృదయం మూవీతో భాషలకు అతీతంగా ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. తాజాగా డియాస్ ఇరాయ్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ మిస్టరీ హారర్ థ్రిల్లర్‌ మూవీని తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స్రవంతి మూవీస్‌ డియాస్ ఇరాయ్‌ని విడుదల చేస్తోంది.

మలయాళ సినిమాలకు టాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్ ఉంది. మోహన్ లాల్ తనయుడు ప్రణవ్ మోహన్ లాల్ మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భూత కాలం', మమ్ముట్టి 'భ్రమ యుగం' చిత్రాలకు దర్శకత్వం వహించిన రాహుల్ సదాశివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. చిత్రాన్ని నైట్ షిఫ్ట్ స్టూడియోస్, వైనాట్ స్టూడియోస్ బ్యానర్లపై చక్రవర్తి రామచంద్ర, ఎస్ శశికాంత్ నిర్మించారు.

ఈ చిత్రానికి క్రిస్టో జేవియర్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళ, తమిళ భాషల్లో అక్టోబర్ 31న  విడుదల కానుంది.  తెలుగు వర్షన్‌ను నవంబర్‌ తొలి వారంలో థియేటర్లలో విడుదల చేయనున్నారు. కాగా.. గతంలో రిలీజైన ప్రేమలు', '2018', 'మంజుమ్మెల్ బాయ్స్', 'కొత్త లోక' లాంటి మలయాళ సినిమాలు తెలుగులో సూపర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.
 

Videos

రైతులను నిండా ముంచిన మోంథా తుఫాన్

శాంతించిన మోంథా.. APకి తప్పిన పెను ప్రమాదం

వంశీ గురించి సక్సెస్ మీట్ లో మాట్లాడతా.. ఒక్కొక్కడి తాట తీస్తా

ఈ రాత్రికే భారీ వర్షం.. తెలంగాణలో ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్

తీరం దాటినా తగ్గని ప్రభావం.. మరో 48గంటలపాటు..

ఆ జిల్లాలకు భారీ వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

మమ్మల్నెవరూ పట్టించుకోవటం లేదు.. విజయవాడలో మహిళ ఆవేదన

సీఎం, డీసీఎం లేకపోయినా అధికారుల పనితీరుకు హ్యాట్సాఫ్

మోంథా ముప్పు.. అధికారుల అప్రమత్తంతో తప్పిన పెను ప్రమాదం

Viral Video: దటీజ్ కోబ్రా.. దాని పౌరుషం చూస్తే.. గుండె గుభేల్

Photos

+5

'మాస్ జాతర' ప్రీ రిలీజ్.. శ్రీలీల క్యూట్ ఎక్స్ప్రెషన్స్ (ఫొటోలు)

+5

కురుమూర్తి జాతర : అంగరంగ వైభవంగా ఉద్దాల ఉత్సవం (ఫొటోలు)

+5

ఒంగోలులో ఈదురుగాలులతో కూడిన వర్షం..రోడ్లు జలమయం (ఫొటోలు)

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు