ఉన్న కారుకే.. రేంజ్ రోవర్ పేరు: నవ్వుకుంటున్న జనం!

Published on Mon, 10/27/2025 - 16:26

మెర్సిడెస్ బెంజ్, రేంజ్ రోవర్ కార్లను కొనాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. అయితే.. ధరలు ఎక్కువ కావడం వల్ల ఈ బ్రాండ్ కార్లను కొనుగోలు చేయడం కష్టమే. ఆలా అని ఒక వ్యక్తి ఊరుకోలేదు.. తన దగ్గర ఉన్న కారుకే.. తనకు ఇష్టమైన కారు పేరును రాసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హ్యుందాయ్ కంపెనీకి చెందిన ఎక్స్‌టర్‌ కారుకు, రేంజ్ రోవర్ అని ఉండటం చూడవచ్చు. కాగా రేంజ్ రోవర్ అక్షరాలా కింద హ్యుందాయ్ లోగో, దానికి కింద ఎక్స్‌టర్‌ అనేది కనిపిస్తున్నాయి. చూడగానే ఇది రేంజ్ రోవర్ అనుకుంటే.. ఎవరైనా పొరబడినట్లే. నిజానికి ఇది చాలామందిని నవ్వుకునేలా చేస్తోంది. పలువురు దీనిపై తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.

సుమారు రూ. 1 కోటి రూపాయల విలువైన కారు కొనాలనే కల ఉన్నప్పటికీ.. దానిని కొనుగోలు చేయలేనప్పుడు ఏం చేయాలి. తన దగ్గర ఉన్న కారుకే ఆ పేరు రాసుకుని సంతోషిస్తున్నాడని కొందరు చెబుతున్నారు. కాగా ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. కలలు పెద్దవిగా ఉండాలి, కారు ఏదైనా సరే అని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: 76 ఏళ్ల విజయానికి గుర్తు!.. ఫెరారీ కొత్త కారు

హ్యుందాయ్ ఎక్స్‌టర్‌
భారతదేశంలో అతి తక్కువ కాలంలో అధిక ప్రజాదరణ పొందిన, కొంత సరసమైన కార్ల జాబితాలో ఒకటి హ్యుందాయ్ ఎక్స్‌టర్‌. దీని ప్రారంభ ధర రూ. 6.88 లక్షలు (ఎక్స్ షోరూమ్). సింపుల్ డిజైన్ కలిగిన ఈ కార్లు.. వాహన వినియోగదారులకు కావలసినన్ని ఫీచర్స్ పొందుతుంది. పనితీరు కూడా ఉత్తమంగా ఉంటుంది.

Videos

తెలంగాణ ప్రభుత్వానికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న మోంథా ముప్పు

తీరం దాటిన తుఫాన్.. నేడు ఏపీలో భారీ వర్షాలు

అవే లేకపోతే జరిగేది ప్రళయమే.. ఎలా కాపాడుతున్నాయి?

తుఫాన్ బీభత్సం.. 30మంది విద్యార్థులకు కరెంట్ షాక్?

భారీ గాలులతో అర్ధరాత్రి అల్లకల్లోలం

రాష్ట్రవ్యాప్తంగా భీకర ప్రళయాన్ని సృష్టిస్తున్న మోంథా

తీరాన్ని తాకిన తుఫాన్.. ఏపీ అల్లకల్లోలం !

Montha Cyclone: ఆ 5 గంటలు జాగ్రత్త.! రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం

Cyclone Mocha: తుఫాన్ తీరం దాటేది ఇక్కడే...

AA22 Movie: ఒకే సినిమాలో నాలుగు హీరోయిన్లు

Photos

+5

తెలంగాణ సీఎంకు సినీ కార్మికుల సన్మానం (చిత్రాలు)

+5

‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

రవితేజ ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

క్రికెటర్ చాహల్ రూమర్ గర్ల్‌ఫ్రెండ్ బర్త్ డే (ఫొటోలు)

+5

Cyclone Montha: మోంథా బీభత్సం.. (ఫొటోలు)

+5

నిషా అగర్వాల్ కొడుకు బర్త్ డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

హీరో నాని 13 ఏళ్ల బంధం.. లవ్‌లీ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరో అజిత్ (ఫొటోలు)

+5

'బైసన్' కోసం పల్లెటూరి అమ్మాయిలా మేకప్ లేకుండా (ఫొటోలు)

+5

తెలుగు హీరోయిన్ అరుణాచలం ట్రిప్ (ఫొటోలు)