జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు
Breaking News
ఫ్లాష్‌బ్యాక్‌లో యాక్షన్
Published on Wed, 10/15/2025 - 00:13
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది.
ఈ సినిమాలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కోసం ఎన్టీఆర్ ఓ డిఫరెంట్ లుక్‌లోకి మారారని టాక్. ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్‌గా నిలవనున్నాయట. ఇదిలా ఉంటే... ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్ టాక్. ఈ చిత్రం 2026 జూన్ 25న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
‘వార్ 2’ రికార్డ్ : హృతిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘వార్ 2’. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యశ్ రాజ్ ఫిల్మ్స్‌పై ఆదిత్య చోప్రా నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 14న విడుదలైంది. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ వేదికగా ఈ నెల 6 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అత్యధిక మంది వీక్షించిన చిత్రాల జాబితాలో ‘వార్ 2’ చిత్రం టాప్‌లో ఉన్నట్లు ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ తెలిపింది. ఈ నెల 6 నుంచి 12 వరకూ 3.5 మిలియన్ల మంది వీక్షించినట్లు ఆ సంస్థ ప్రకటించింది. దీంతో గత వారం ఇండియాలోనే ఎక్కువమంది చూసిన సినిమాగా ‘వార్ 2’ నిలిచింది.
Tags : 1