Breaking News

ప్రముఖ నటుడు రోబో శంకర్‌ కన్నుమూత

Published on Fri, 09/19/2025 - 06:45

ప్రముఖ కోలీవుడ్‌ నటుడు రోబో శంకర్‌(46) కన్నుమూశారు. రెండ్రోజుల కిందట హఠాత్తుగా అనారోగ్యానికి గురైన ఆయన చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో చేరాడు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆయన మరణించారు. దీంతో తమిళ చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది. 

శంకర్‌ తొలినాళ్లలో రోబో డ్యాన్సులకు ఫేమస్‌. అలా ఆయన పేరు రోబో శంకర్‌గా మారింది. స్టేజ్‌ షోలతో చలన చిత్ర రంగానికి, అటుపై సిల్వర్‌ స్క్రీన్‌కు చేరారీయన. ఆయన తొలి చిత్రం ధర్మ చక్రం(1997). అయితే, ఈ చిత్రంలో ఆయన పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. విజయ్‌ సేతుపతి ఇధర్కుతానే ఆసైపట్టై బాలకుమారా" (2013) చిత్రంతో ఆయనకు గుర్తింపు దక్కింది. ధనుష్‌ మారితో ఆయనకు పాపులారిటీ దక్కింది. విశాల్‌ ఇరుంబు తిరై (2018), అజిత్‌ విశ్వాసం (2019), విశాల్‌ చక్ర (2021), విక్రమ్‌ కోబ్రా (2022), కలకలప్పు 2, పులి, యముడు 3, మిస్టర్ లోకల్ తదితర చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నారు.  సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించారు. 

అయితే కామెర్లతో బాధపడుతున్న ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు తగ్గించారు. ఈ క్రమంలోనే ఆయన బరువు తగ్గడం ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఈ క్రమంలో.. ఒక సినిమా షూటింగ్‌లో పాల్గొన్న రోబో శంకర్‌ సడెన్‌గా స్పృహతప్పి  పడిపోయారు. దీంతో చిత్ర యూనిట్‌ వెంటనే ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించింది. వైద్యులు రెండురోజులుగా ఐసీయూలో చికిత్స అందిస్తుండగా ఈ గురువారం రాత్రి ఆయన మరణించారు. జీర్ణాశయంలో రక్తస్రావం, అంతర్గతంగా అవయవాలు చెడిపోవడంతో ఆయన కన్నుమూసినట్లు వైద్యులు ప్రకటించారు.

ఆయనకు భార్య, కుమార్తె ఉన్నారు. గతేడాది తన కుమార్తెకు ఘనంగా వివాహం జరిపించిన విషయం తెలిసిందే. విజయ్‌ బిగిల్‌ చిత్రంలో ‘గుండమ్మ’గా అలరించిన నటి ఇంద్రజ ఈయన కూతురే. రోబో శంకర్‌ భార్య సింగర్‌, నటి కూడా.

రోబో శంకర్‌ హఠాన్మరణం పట్ల కోలీవుడ్‌ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నటుడు ధనుష్‌ రోబో శంకర్‌ ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. నటుడు, రాజ్యసభ ఎంపీ కమల్ హాసన్ సోషల్‌ మీడియా ద్వారా సంతాపం తెలిపారు.  
 

Videos

ఎందుకు మీకు అంత భయం.. విడుదల రజినిని ఆపేసిన పోలీసులు

రూ.6 వేల కోట్లు ఇవ్వడానికి చేతులు పడిపోయినాయా బాబూ..

నాగ్ 100 కోసం భారీ స్కెచ్.. కానీ

Jr Ntr: 7 వారాల్లో... 10 కిలోల బరువు తగ్గిన టైగర్

కుమ్మేస్తున్న రామ్ చరణ్! మెగా ఫ్యాన్స్ కు పూనకాలే

పోలీసుల ఓవరాక్షన్.. YSRCP నేతల ఉగ్రరూపం.. మచిలీపట్నంలో హైటెన్షన్!

తన బినామీలకు దోచిపెట్టడానికే బాబు కుట్రలు

చలో మెడికల్ కాలేజీ నిరసనలో... దద్దరిల్లిన మచిలీపట్నం

ఎవరి సొమ్ము.. ఎవరి సొత్తు.. బాబును రఫ్ఫాడించిన పేర్ని కిట్టు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై YARCP ఎమ్మెల్సీ ల నిరసన

Photos

+5

కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ.. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌పై ఉవ్వెత్తున ఉద్య‌మం (చిత్రాలు)

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)