Breaking News

ఆ ఆరోపణలు తప్పు.. అదానీకి సెబీ క్లీన్ చిట్

Published on Thu, 09/18/2025 - 20:05

న్యూఢిల్లీ: అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి అదానీ గ్రూప్‌నకు, దాని చైర్మన్‌ గౌతమ్ అదానీకి మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. ఇన్ సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మానిప్యులేషన్, పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై వివరణాత్మక దర్యాప్తు తర్వాత అవి పూర్తీగా నిరాధారమైనవని సెబీ రెండు వేర్వేరు వివరణాత్మక ఉత్తర్వులలో తెలిపింది.

హిండెన్ బర్గ్ 2023 జనవరిలో అదానీ గ్రూప్‌పై సంచలన ఆరోపణలతో ఒక నివేదికను వెల్లడించింది. అడికార్ప్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్ స్టోన్ ట్రేడ్ లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థలను వాడుకుని పబ్లిక్‌ లిస్టెడ్‌ కంపెనీలైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ లకు నిధులు సమకూర్చడానికి వివిధ అదానీ గ్రూప్ కంపెనీల నుండి నిధులను మళ్లించారని ఆరోపించింది.

అయితే అదానీ గ్రూపుపై ఈ అభియోగాలను సెబీ కొట్టేసింది. అదానీ గ్రూప్ ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని, ఎలాంటి అనైతిక కార్యకలాపాలకు పాల్పడలేదని స్పష్టం చేసింది. దీనిపై స్పందించిన గౌతమ్ అదానీ.. పడిన ప్రతిసారి మరింత గట్టిగా పైకి లేస్తామన్నారు. తమ సంస్థను నష్టపరిచేందుకు కొన్ని వర్గాల మీడియా స్వార్థ ప్రయోజనం కోసం ఆరోపణలు చేసిందని వెల్లడించారు.

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే