17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట
Breaking News
మోహన్ లాల్ పాన్ ఇండియా మూవీ.. పవర్‌ఫుల్ టీజర్ వచ్చేసింది
Published on Thu, 09/18/2025 - 19:34
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటిస్తోన్న ద్విభాషా చిత్రం వృషభ. ఈ చిత్రానికి నంద కిశోర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫుల్ యాక్షన్ మూవీ దీపావళి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా వృషభ టీజర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను మలయాళంతో పాటు.. తెలుగులోనూ ఓకేసారి తెరకెక్కించారు. ఈ పాన్ ఇండియా చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
టీజర్ చూస్తుంటే ఈ మూవీని పురాణాల నేపథ్యంలోనే తెరకెక్కించినట్లు తెలుస్తోంది. విజువల్స్, యాక్షన్ సీన్స్ బాహుబలి తరహాలో మోహన్ లాల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బీజీఎం కూడా టీజర్ను మరో రేంజ్కు తీసుకెళ్లింది. ఈ చిత్రంలో మోహన్ లాల్ తొలిసారిగా రాజు పాత్రలో కనిపించనున్నారు. కత్తితో ఫైట్ చేస్తున్న సీన్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచేశాయి. కాగా.. ఈ చిత్రంలో సమర్జిత్ లంకేష్, రాగిణి ద్వివేది కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియోస్, కనెక్ట్ట్ మీడియా, బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్ల నిర్మించారు. ఇంకెందుకు ఆలస్యం వృషభ టీజర్ చూసేయండి.
Tags : 1