Breaking News

'హ్యూమన్ వాచ్': చూపుతిప్పుకోనివ్వని అమేజింగ్‌ ఆర్ట్‌..

Published on Thu, 09/18/2025 - 13:31

కొన్ని అద్భుతాలు హృదయానికి హత్తుకునేలా మంత్రముగ్ధల్ని చేస్తుంటాయి. అస్సలు ఇలాంటి ఆలోచన ఎలా వచ్చిందా అని ఆశ్చర్యమేస్తుంది. చూడటానికి రియలిస్టిక్‌గా ఉండే ఆర్ట్‌ల గొప్పదనం మాటల్లో చెప్పలేం. అంత ఓపికగా ఎలా  చేస్తున్నారనే అనుమానం కచ్చితంగా వచ్చేస్తుంది. ఓ భారతీయడు ఆ అందమైన క్లాక్‌ కళకు సంబంధించిన వీడియోని నెట్టింట షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది. 

అందులో ఏముందంటే..నెదర్లాండ్‌ ప్రధాన అంతర్జాతీయ కేంద్రమైన ఆమ్‌స్టర్‌డామ్‌ విమానాశ్రయం షిపోల్‌లో ప్రత్యేకమైన 'హ్యూమన్ వాచ్'ను చూసి భారతీయ ప్రయాణికుడు ఎస్‌కే ఆలీ విస్తుపోయాడు. చూడటానికి నిజమైన గడియారాన్ని తలపించే హ్యుమన్‌ వాచ్‌ ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే రెండు కళ్లు చాలవేమో అన్నంతగా మాయ చేస్తోంది. ఆ గడియారంలో ఒక మనిషి అచ్చం రియల్‌ గడియారంలో టైం చూపించే ముల్లుల మాదిరిగా క్షణాల్లో టైంని చూపిస్తూ..తుడుస్తూ కనిపిస్తుంది. 

అదంతా ఏదో మ్యాజిక్‌ చేసినట్లుగా ఏ మాత్రం ఒంకర టిక్కరి లైన్లు లేకుండా రియల్‌ గడియారం మాదిరిగా టైంని చూపిస్తున్న విధానం చూస్తే..నోటమాట రాదని అంటున్నాడు అలీ. ఆ గడియారం లోపల వ్యక్తి చేతితో ప్రతి నిమిషాన్ని ఇండికేట్‌ చేసేలా నిమిషా ముల్లుల గీతలను రిప్రెజెంట్‌ చేస్తూ చెరిపేయడం చూస్తే..ఇంతలా గీయడం ఎవ్వరికీ సాధ్యం కాదనిపిస్తుంది. చూడటానికీ ఏదో యానిమేటెడ్‌లా ఉంటుంది. 

ఒక సాధారణ గడియారాన్ని మిళితం చేసేలా ఉంది ఈ హ్యూమన్‌ వాచ్‌ కళ. రియల్‌ టైమ్‌గా పిలిచే హ్యుమన్‌ వాచ్‌ని డచ్‌ కళాకారుడు మార్టెన్‌బాస్‌ రూపొందించారట. ఇందులో నటుడు టియాగో సాడా కోస్టా పారదర్శక తెరపై గడియారపు ముళ్లను చెరిపివేసి తిరిగి గీస్తున్న 12 గంటల లూప్‌ చేయబడిన వీడియో ఉంది. ఆ పెయింటింగ్‌ సయంలో నిమిషానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ముద్రను చూపిస్తుంది. నెటిజన్లు ఈ వీడియోని చూసి ఈ కళారూపం వెనుక ఉన్న క్రియేటివిటీకి జోహార్లు అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: పీహెచ్‌డీ గ్రాడ్యుయేట్‌ ఫుడ్‌ స్టాల్‌తో రోజుకు రూ.లక్ష పైనే..!)

 

Videos

Jagtial: 300 కోసం ఆటో డ్రైవర్‌ మర్డర్

2007లో జరిగిన వేలానికి నాకు ఏం సంబంధమో చిన్నీ చెప్పాలి: పేర్ని నాని

AP: కండక్టర్లకు ఫ్రీ బస్సు తంటాలు

తాడేపల్లిలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ

Vidadala: ఇది తొలి అడుగు మాత్రమే... మీ పతనం ఇప్పటి నుండి ప్రారంభం

Narayana College: విద్యార్థిపై దాడి చేసిన ఫ్లోర్ ఇన్చార్జ్ సతీష్

Heavy Rain: హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ

ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఘటన ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడంతో చర్యలు

Jada Sravan: మాకు మద్దతు తెలిపిన వైఎస్ జగన్ కు ధన్యవాదాలు

హరీష్ నన్ను కూడా కొట్టాడు..! హరిత షాకింగ్ కామెంట్స్

Photos

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)

+5

తెలంగాణలో కొలువైన శ్రీరంగనాథస్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

‘బ్యూటీ’ మూవీ ప్రమోషన్స్ లో నరేష్, వాసుకి ఆనంద్ (ఫొటోలు)

+5

ఓజీ ప్రమోషన్స్ లో ప్రియాంక.. బ్లాక్ డ్రెస్ లో క్యూట్ లుక్స్ (ఫొటోలు)

+5

సైమా అవార్డ్స్‌ -2025లో అందరినీ ఆకర్షించిన ఫోటోలు ఇవే