సర్‌.. నా భార్య చిలిపి దొంగతనాలు చేస్తోంది!

Published on Thu, 09/18/2025 - 07:03

నా భార్య వయసు 45 ఏళ్ళు. మాకు ఒక సొంత సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఉంది. మంచి ఉన్నతమైన కుటుంబం. మా ఆవిడకు మొదటి నుంచి ఒక వింత అలవాటు ఉంది. షాపింగ్‌కు వెళ్లినపుడు అవసరం లేకపోయినా, కొనగలిగిన స్థోమత ఉన్నా, ఏదో ఒక వస్తువు దొంగిలిస్తుంది. ఆమె దొంగిలించే వాటిలో కాస్మెటిక్స్‌ లాంటి చిన్న వస్తువుల నుంచి, ఒక్కోసారి చీరలు, చిన్న బంగారు వస్తువులు కూడా ఉన్నాయి. అలా దొంగిలించినవి కొన్ని ఇంట్లో దాచిపెడుతుంది. కొన్నేమో ఇతరులకు తాను గొప్ప అనిపించుకోవడానికి అన్నట్లు పంచిపెడుతుంది. ఆమెకు 300లకు పైగా చీరలు,కోట్లు విలువ చేసే బంగారు నగలు ఉన్నాయి. ఒక్కోసారి నా జేబులోంచి కూడా, నాకు చెప్పకుండా డబ్బులు తీసి దాస్తుంది. ఇన్ని చేసినా ఏమి తెలియనట్లు ఉంటుంది. ఏమాత్రం గిల్టీగా ఫీలవదు. ఇన్ని ఆస్తిపాస్తులుండి కూడా, ఆమె ఎందుకు ఇలా చీప్‌గా దొంగతనాలు చేస్తుందో అర్థం కావడం లేదు. ఇలా చేసి కొన్నిసార్లు షాప్స్‌లో పట్టుబడితే, పొరపాటయిందని సారీ చెప్పింది. ఆమె ప్రవర్తన వల్ల నాకు ఇబ్బందిగా ఉంది. బయట ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది. సాక్షిలో మీ కాలమ్‌ చూసి, మీరే ఏదైనా మంచి పరిష్కారం చూపిస్తారనే ఆశతో ఉన్నాను!
– కామేశ్వరరావు, హైదరాబాద్‌

రావుగారూ! మీరెంతో ఆవేదనతో మీ సమస్యను సాక్షి ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు. మీరన్నట్లుగా ఇది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. అన్నీ ఉన్నా, అవసరం లేకున్నా ఇలా దొంగతనాలు చేయడాన్ని ‘క్లెప్టోమెనియా’ అంటారు. ఇది చాలా అరుదైన ఒక వింత మానసిక సమస్య. ఈ సమస్య ఉన్న వారికి, ఎలాగైనా ఏదో ఒకటి దొంగిలించాలనే ‘తహ తహ’ ఉంటుంది. వాస్తవానికి ఆ దొంగిలించిన వస్తువు వల్ల వారికి ఎలాంటి అవసరం ఉండదు. 

ఆ వస్తువు విలువ కూడా చాలా స్వల్పమై ఉండవచ్చు. మామూలు దొంగతనాల లాగా వీరు ఏదీ ప్లాన్‌ చేసుకుని, దొంగతనాలు చేయరు. ఏదైనా షాపింగ్‌కి అని వెళ్లినపుడు అలా సడన్‌గా చేతికందిన ఏదో ఒక వస్తువును వారికవసరం లేకపోయినా ఎత్తేస్తుంటారు. బాగా స్థోమత కలిగి, డబ్బులు పెట్టి కొనగలిగిన వారిలోనే ఈ అలవాటు ఎక్కువ. బహిష్టు సమయంలో ఇలాంటి కోరిక, కొందరిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఆ సమయంలో కనబడిన వస్తువు ఎత్తేయకుంటే విపరీతమైన టెన్షన్‌కు గురయి, తీసిన తర్వాత చాలా మానసిక ప్రశాంతతకు లోనవుతారు. దీనిని ‘ఇంపల్స్‌ కంట్రోల్‌ డిజార్డర్‌’ అని కూడా అంటారు. 

ఈ అలవాటు యుక్తవయసులో మొదలై పెద్దయ్యే కొద్ది తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ కొందరిలో మాత్రం శాశ్వతంగా ఉండి΄ోతుంది. ఈ సమస్య నుంచి బయటపడేయాలంటే ఆ వ్యక్తి సహకరించాలి. కొన్నిరకాల మందులతో పాటు ‘కాగ్నిటివ్‌ బిహేవియర్‌ మాడిఫికేషన్‌’ లాంటి ప్రత్యేక మానసిక చికిత్స పద్ధతుల ద్వారా ఇలాంటి వారిని ఈ అలవాటు నుండి బయటపడేసే అవకాశముంది. మొదట్లోనే ఈ అలవాటు గుర్తించి మానసిక వైద్యుడిని కలిస్తే ఫలితాలు మంచిగా ఉంటాయి. ఇప్పటికైనా మీ భార్యను మంచి నిపుణులైన సైకియాట్రిస్ట్‌  క్లినికల్‌ సైకాలజిస్టుల పర్యవేక్షణలో తగిన థెరపీ చేయించండి. ఆల్‌దిబెస్ట్‌!


డాక్టర్‌ ఇండ్ల విశాల్‌ రెడ్డి, సీనియర్‌ సైకియాట్రిస్ట్, విజయవాడ.
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్‌ ఐడీ: sakshifamily3@gmail.com)

Videos

17 మెడికల్ కాలేజీల వద్ద నేడు YSRCP పోరుబాట

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

మహేష్ తో ప్రభాస్ డైరెక్టర్.. స్క్రీన్స్ బ్లాస్ట్ పక్కా

మీలాంటి దుష్ట శక్తులనుండి ప్రజలను కాపాడాలని ఆ అప్పన్న స్వామిని వేడుకుంటున్నా

గుర్తుపెట్టుకో.. మేమే నిన్ను గెలిపించాం.. మేమే వచ్చే ఎన్నికల్లో నిన్ను ఓడిస్తాం

అధికారం రాగానే కళ్ళు నెత్తికెక్కాయి.. అనితను రఫ్ఫాడించిన నాగ మల్లీశ్వరి

పోలీసులా? టీడీపీ కార్యకర్తలా? విద్యార్థులను ఈడ్చుకెళ్ళిన పోలీసులు

బిల్డప్ మాధవి.. కడప ఎమ్మెల్యే ఓవరాక్షన్

బాబూ.. నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి మంచి పని చేశావా..

కారును ఈడ్చుకెళ్లిన టిప్పర్.. ఏడుగురిని చంపిన టీడీపీ నేత అత్యాశ

Photos

+5

విజయవాడ : కనులపండువగా దసరా సాంస్కృతిక ఉత్సవాలు (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఉదయం ఉక్కపోత..సాయంత్రం కుండపోత వర్షం (ఫొటోలు)

+5

హైదరాబాద్ రోడ్డుపై అడవి జంతువులు..అవునా.. నిజమా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ట్రాఫిక్‌ సమ్మిట్‌–2025..ముఖ్య అతిథిగా సాయి ధరమ్ తేజ్ (ఫొటోలు)

+5

కోర్ట్‌ జంట రిపీట్‌.. ఈసారి బావమరదళ్లుగా..(ఫోటోలు)

+5

ఏపీలో అసలు ప్రభుత్వం ఉందా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

బ్యూటీఫుల్ శారీలో బ్యూటీ హీరోయిన్ నీలఖి పాత్ర (ఫోటోలు)

+5

దివినుంచి దిగి వచ్చిన తారలా ‘పరదా’ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మీనాక్షి చౌదరి (ఫోటోలు)

+5

'కిష్కింధపురి' మూవీ సక్సెస్ మీట్..ముఖ్య అతిథిగా సాయి దుర్గ తేజ్ (ఫొటోలు)