వెలిగొండ ప్రాజెక్ట్ పై పవన్ కు శ్యామల స్ట్రాంగ్ కౌంటర్
Breaking News
చేప.. చేదా...వర్షకాలంలో అస్సలు తినకూడదా..?
Published on Wed, 07/16/2025 - 11:30
ఎంతగా మనకు ఇష్టం ఉన్నప్పటికీ వర్షాకాలంలో చేపలు తినడం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే...ఇది చేపల ఉత్పత్తి సమయం అంటే బ్రీడింగ్ సైకిల్..వర్షాకాలంలో చేపలు సంతానాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఆ సమయంలో వాటిని తినడం అంత మంచిది కాదు. అది వాటి పునరుత్పత్తిని వ్యతిరేకించే చర్య దీని వల్ల చేపల జనాభా మందగిస్తుంది..
అలాగే పర్యావరణ సమతౌల్యం దెబ్బతింటుంది కూడా. అందువల్ల ఈ సమయంలో చేపలను తీసుకోవడం తగ్గిస్తే మన ఆరోగ్యానికి మాత్రమే కాదు పర్యావరణానికి మేలు చేసిన వాళ్లం అవుతాం. అంతేకాదు వాటి బ్రీడింగ్ దెబ్బతినకూడదని కొన్ని ప్రాంతాల్లో ఈ సీజన్‌లో చేపల వేటను నిషేధిస్తారు కూడా. తద్వారా నాణ్యమైన చేపల దిగుబడి తగ్గుతుంది.
వర్షాలు వస్తే సరఫరా వ్యవస్థలో కీలకమార్పులు చోటు చేసుకుంటాయి. వినియోగదారులకు చేపలను అందించేందుకు ట్రాన్స్‌పోర్ట్ చేసే ట్రక్, నిల్వ చేసే పోలీస్టర్ బ్యాగులు తదితర పద్ధతుల్లో అలసత్వం మరింత బాక్టీరియా పెరుగుదలకు దారితీసే అవకాశం ఉంటుంది.
వర్షాలు నీటిని కలుషితం చేస్తాయి, యాంటిజన్లను, బ్యాక్టీరియా, వైరస్‌ల వృద్ధికి కారణమవుతాయి. ఈ పరిస్థితిలో చేపలు ఆ కలుషిత నదీ/ తలపు/ఏరియా నీళ్ళలో ఉంటే, వాటి ద్వారా మనకు కలరా, హెపటైటిస్ బి, టైఫాయిడ్, గ్యాస్ట్రోఎంటరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం పెరుగుతుంది అంతేకాదు అలర్జీలు ఉన్నా లేక వ్యాధి నిరోధక శక్తి లేకపోయినా వారికి కూడా ఈ సీజన్‌లో చేపలు ఆహారం మంచిది కాదని వైద్యులు అంటున్నారు.
వర్షాకాలంలో వాతావరణంలో తేమ ఉండటం వల్ల, చేపలు మరింత వేగంగా పాడైపోవడం జరుగుతుంది. ఇది కొద్దిగా తాజా కనబడినా, అది వాస్తవానికి పాడైపోవడం కాకపోవడం అన్న ఒక గందరగోళ అనుభూతి మాత్రమే. ఆరోగ్యం దృష్ట్యా ప్రొటీన్ కోసం తీసుకుంటున్నవారు ప్రత్యామ్నాయంగా, ప్రోటీన్ అవసరాన్ని తీర్చుకోవడానికి కొన్ని రకాల శాఖాహారాలను ఎంచుకోవచ్చు.
చేపలను తీసుకోకుండా ఉండలేని ఫిష్ లవర్స్ ఈ సీజన్‌లో చేపలను తక్కువగా లేదా ఆచి తూచి ఎంచుకుని తినడం అవసరం. విశ్వసనీయమైన విక్రయదారుని నుంచి మాత్రమే చేపలు కొనుగోలు చేయాలి. సరైన , తగినంత టెంపరేచర్‌లో పరిశుభ్రమైన పద్ధతిలో వండి మాత్రమే వినియోగించాలి. తాయ్ మంగూర్ వంటి కొన్ని హానికారక జాతుల చేపల్ని ప్రభుత్వం నిషేధించింది. అయినప్పటికీ కొందరు విక్రయిస్తున్నారు. ఇలాంటి చేపల జాతుల గురించి అవగాహనతో ఎంపిక చేసుకోవాలి.
(చదవండి: దృఢ సంకల్పానికి కేరాఫ్ అడ్రస్ ఈ పారాసైక్లిస్ట్..! ఒంటి కాలితో ఏకంగా..)
Tags : 1