Weather: ఏపీకి భారీ వర్ష సూచన
Breaking News
తిరస్కారాలే.. విజయానికి మెట్లుగా..
Published on Wed, 07/16/2025 - 09:46
‘నా జీవన ప్రయాణంలో ఎన్నో తిరస్కారాలకు గురయ్యాను.. అయినా వెనక్కి తగ్గలేదు.. వాటినే విజయవానికి మెట్లుగా మలచుకున్నా’ అని ఆస్కార్ అవార్డు విజేత, ప్రముఖ సినీ నిర్మాత గునీత్ మోంగా అన్నారు. యువ మహిళా పారిశ్రామికవేత్తల సంఘం వైఎఫ్‌ఎల్‌ఓ (యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్) ఆధ్వర్యంలో బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్లో ‘గోల్డెన్ లెన్స్’ పేరిట నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని తన జీవితంలో ఎదురైన అనుభవాలను వారితో పంచుకుని స్ఫూర్తిని నింపారు. ‘20 సంవత్సరాలు ఒక అద్దె ఇంట్లో జీవించాను. నా తల్లిదండ్రులకు ఇల్లు కొనాలని అనుకున్నా.
నెలకు రూ.5,000 అద్దె చెల్లిస్తూ జీవితాన్ని గడిపా. నా ప్రయాణం అంత సులభం కాదు. జీవితంలో అనేక ఛీత్కారాలను స్వాతగించా’ అని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఏడాదికి 1500లకు పైగా సినిమాలు నిర్మితమవుతున్నా అందులో 10 శాతం కూడా మహిళా దర్శకులు లేకపోవడం బాధాకరమని, ఈ పరిస్థితి మారాలని, అందుకే ఉమెన్ ఇన్ ఫిలిం–ఇండియా చాప్టర్‌ని ప్రారంభించామని అన్నారు. ఇది మహిళలకు మద్దతు ఇచ్చే ప్లాట్‌ఫాం అని, వాళ్ల గొంతు వినబడాలని అన్నారు.
హైదరాబాద్ అన్నా, బిర్యానీ అన్నా ఇష్టం..
తనకు హైదరాబాద్ అన్నా, ఇక్కడి బిర్యానీ అన్నా ఎంతో ఇష్టమని, అవకాశం లభిస్తే టాలీవుడ్ కళాకారులతో కలిసి పనిచేయాలని ఉందని అన్నారు. ఆమె నిర్మించిన ప్రసిద్ధ చిత్రాలు ‘ది లంచ్ బాక్స్, మసాన్, పగ్‌గలైత్, ఆస్కార్ గెలుచుకున్న డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ద ఎలిఫెంట్ విస్పరర్ వంటి చిత్ర అనుభవాలను పంచుకున్నారు. వైఎఫ్‌ఎల్‌ఓ చైర్‌పర్సన్ పల్లవిజైన్ మాట్లాడుతూ గునీత్ అనేక మందికి స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌ఎల్‌ఓ, వైఎఫ్‌ఎల్‌ఓ సభ్యులు పాల్గొన్నారు.
(చదవండి: హైబ్రీడ్ డ్యాన్స్ స్టైల్..!)
Tags : 1