భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్
Breaking News
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
Published on Mon, 07/14/2025 - 19:50
ఎలాన్‌మస్క్‌కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్‌లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్‌లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్‌కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.
ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
ఈ ప్లాన్‌లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్‌బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్‌లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్‌కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్‌లో గ్రోక్‌ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం.
Tags : 1