తెలివిలేక కాళేశ్వరాన్ని కూలేశ్వరం అంటున్నారు: కేటీఆర్
Breaking News
పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?
Published on Mon, 07/14/2025 - 18:35
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 20వ విడత నిధుల కోసం ఎంతో మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తదుపరి విడత పీఎం కిసాన్ నిధులను ఎకరాకు రూ.2,000 చొప్పున ఈ జులైలోనే విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. పీఎం కిసాన్ నిధులను ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. చివరి 19వ విడతను 2025 ఫిబ్రవరిలో విడుదల చేశారు. గతేడాది జూన్ వాయిదాను నెల ముగియకముందే విడుదల చేశారు. అయితే ఈసారి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది.
త్వరలోనే జూన్ వాయిదాలను ఈ జులైలో విడుదల చేయబోతున్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. రైతులు తమ అర్హతను తెలుసుకోవాలని, ఈ-కేవైసీని అప్‌డేట్ చేయాలని సూచిస్తున్నారు. రైతుల చిరునామా కూడా వ్యాలిడేట్ అయ్యేలా చూసుకోవాలని చెప్పారు. కొందరి చిరునామా, లొకేషన్ రికార్డుల్లో తప్పుల కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నట్లు తెలిపారు. కాబట్టి చిరునామాను అప్‌డేట్ చేయాలని చెప్పారు.
పీఎం కిసాన్ భూమి చిరునామా అప్‌డేట్ చేయడం ఎలా?
1. పీఎం కిసాన్ వెబ్సైట్.. https://pmkisan.gov.inలోకి వెళ్లాలి.
2. హోమ్ పేజీలోని ఫార్మర్స్ కార్నర్ కింద ‘స్టేట్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్’పై క్లిక్ చేయాలి.
3. ‘రిజిస్ట్రేషన్ నంబర్’ లేదా ‘ఆధార్ నంబర్’ ఎంటర్ చేయాలి.
4. కింద క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి.
5. గెట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
6. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ అందులో ఫిల్ చేయాలి.
7. మీ పేరు మీద సాగు భూమి రుజువు పత్రాలను అప్‌లోడ్ చేయాలి. (పట్టా పుస్తకాలు, భూ రికార్డులు..మొదలైనవి)
8. మీరు చేసిన మార్పులను సమీక్షించి ఆన్‌లైన్‌లో ఫామ్ సబ్మిట్ చేయాలి.
ఈ-కేవైసీ ఎలా పూర్తి చేయాలి?
ఈ పథకం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పీఎం కిసాన్ రిజిస్టర్డ్ రైతులకు ఈకేవైసీ తప్పనిసరి. ఓటీపీ ఆధారిత ఈ-కేవైసీ, బయోమెట్రిక్ ఈ-కేవైసీ, ఫేషియల్ అథెంటికేషన్ అనే మూడు సులువైన మార్గాల్లో ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
పీఎం-కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ స్టేటస్‌ను ఎలా తనిఖీ చేయాలి?
https://pmkisan.gov.in అధికారిక వెబ్‌సైట్ సందర్శించాలి.
‘నో యువర్ స్టేటస్’పై క్లిక్ చేయాలి.
మీ రిజిస్ట్రేషన్ నెంబరు లేదా ఆధార్ నెంబరు ఎంటర్ చేయాలి.
లబ్ధిదారుల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి.
ఇదీ చదవండి: మరో 2,400 మంది ఉద్యోగాలు కట్!
పీఎం కిసాన్ స్కీమ్
2019లో అప్పటి ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ మధ్యంతర బడ్జెట్‌లో ఈ పథకాన్ని ప్రకటించారు. తర్వాత పీఎం కిసాన్ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకంగా నిలిచింది. దీని కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ.2,000 చొప్పున ఏప్రిల్-జులై, ఆగస్టు-నవంబర్, డిసెంబర్-మార్చి నెలల్లో ఏటా రూ.6,000 చొప్పున అందిస్తారు.
Tags : 1