Breaking News

ఇంటర్నెట్‌ స్పీడ్‌ పెంచి జపాన్‌ ప్రపంచ రికార్డు

Published on Mon, 07/14/2025 - 15:34

డిజిటల్‌ మౌలిక సదుపాయాలు వేగంగా విస్తరిస్తున్నాయి. పదేళ్ల కిందట ఒక మూవీ లేదా ఏదైనా ఒకమోస్తారు లార్జ్‌ఫైల్‌ను డౌన్‌లోడ్‌ చేయాలంటే చాలా సమయం పట్టేది. కానీ ప్రస్తుతం క్షణాల్లో డౌన్‌లోడ్‌ అయిపోతుంది. ఇటీవల జపాన్‌ పరిశోధకులు భారీగా ఇంటర్నెట్ స్పీడ్ లిమిట్‌ను పెంచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఒక్క సెకనులో నెట్‌ఫ్లిక్స్‌లోని మొత్తం డేటా డౌన్‌లోడ్‌ చేసేంత నెట్‌స్పీడ్‌ వచ్చేలా పరిశోధనలు చేశారు.

జపాన్‌ పరిశోధకులు జరిపిన ఎక్స్‌పరిమెంట్‌ ప్రకారం ఇంటర్నెట్ వేగం సెకనుకు 1.02 పెటాబైట్లకు చేరుకుంది. జపాన్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐసీటీ) శాస్త్రవేత్తలు ఈమేరకు ప్రపంచ రికార్డు సాధించారు. మనలో చాలా మంది ఇంటర్నెట్ వేగాన్ని సెకనుకు మెగాబైట్స్ (ఎంబీపీఎస్)లో కొలుస్తారు. ఒక పెటాబైట్ ఒక మిలియన్ గిగాబైట్లకు సమానం లేదా ఒక బిలియన్ మెగాబైట్‌కు సమానం. కాబట్టి ఈ కొత్త రికార్డుతో సుమారు 1,020,000,000 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ఇంటర్నెట్‌ను అందించేలా పరిశోధనలు చేశారు. అమెరికాలో సగటు ఇంటర్నెట్ స్పీడ్ 300 ఎంబీపీఎస్ కాగా, భారత్‌లో 64 ఎంబీపీఎస్‌గా ఉంది. ఈ కొత్త వేగం నెట్‌ఫ్లిక్స్‌ మొత్తం కంటెంట్ లైబ్రరీని సెకనులో డౌన్‌లోడ్‌ చేస్తుంది.

ఇదీ చదవండి: ఎవరు చెప్పినా వినండి.. కానీ..

ఎన్ఐసీటీ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ స్పీడ్‌ను సాధించేందుకు పరిశోధనా బృందం 19 కోర్లతో ప్రత్యేక రకం ఆప్టికల్ ఫైబర్‌ను ఉపయోగించింది. ఇందులో 19 చిన్న ఛానళ్లు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి డేటాను తీసుకెళ్లగలవు. సాధారణంగా ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ కేవలం ఒక కోర్‌ను కలిగి ఉంటాయి. ఈ పరీక్ష స్వల్ప దూరానికే పరిమితం కాలేదు. ఈ టెస్టింగ్‌ ద్వారా 1,808 కిలోమీటర్లు (సుమారు 1,123 మైళ్లు) డేటాను ప్రసారం చేశారు. ప్రతి 86.1 కిలోమీటర్ల పొడవు ఉన్న 19 వేర్వేరు సర్క్యూట్ల ద్వారా సిగ్నల్‌ను లూప్ చేసే సెటప్‌ను ఉపయోగించారు. మొత్తం 180 డేటా స్ట్రీమ్‌లు ఒకేసారి ప్రసారం చేశారు. ఫలితంగా బ్యాండ్‌విడ్త్‌ కిలోమీటరుకు సెకనుకు 1.86 ఎక్సాబిట్లుగా నమోదైంది. ఇప్పటికే ఉన్న మౌలిక సదుపాయాలను ఉపయోగించి అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ వేగాన్ని సాధించవచ్చని నిరూపించడమే తమ లక్ష్యమని ఎన్ఐసీటీ తెలిపింది.

Videos

పెళ్లి తర్వాత మాత్రం కలిసి ఉండలేకపోతున్నారు

భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో తిరుపతిలో భారీ నిరసన

ఉప్పల హరికను పరామర్శించిన YSRCP నేతలు

శ్రీనివాసులు హత్య కేసులో నా కొడుకుకు ఎలాంటి సంబంధం లేదు: తాసిర్ తల్లి

YS Jagan Tweet: శభాష్ శుభాంశు..

Perni Kittu: మహానటి అని పేరు పెడతావా.. సిగ్గుందా.. నువ్వు మనిషిగా పుట్టుంటే..

ముగ్గుర్ని కన్నోళ్లే దేశభక్తులు బాబు అపరిపక్వ రాజకీయం

ఉప్పాల హారికను పరామర్శించిన YSRCP నేతలు

Palnadu: కొడుకుని తగలబెట్టిన తండ్రి

బిల్లు కట్టకుండా మందుబాబులు పరార్

Photos

+5

స్విట్జర్లాండ్ టూర్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న భార‌త క్రికెట‌ర్‌

+5

డల్లాస్ కన్సర్ట్‌లో దిల్‌రాజు దంపతులు సందడి (ఫొటోలు)

+5

సాహో శుభాంశు శుక్లా.. సరికొత్త చరిత్ర సృష్టించిన ఇస్రో (ఫొటోలు)

+5

మూడేళ్ల తర్వాత వచ్చేస్తున్న నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం బర్త్‌డే.. లైఫ్‌లో ప్రత్యేకమైన క్షణాలు (ఫోటోలు)

+5

600 మీటర్ల లోతు నీటి గుహలో ప్రయాణం..నరసింహ స్వామి దర్శనం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

తిరుపతిలో రైలు అగ్నిప్రమాదం (ఫొటోలు)

+5

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి రంగం ఊరేగింపు (ఫొటోలు)

+5

నటుడు అర్జున్ పెళ్లిలో హీరో జయం రవి డ్యాన్స్ (ఫొటోలు)

+5

'మోనికా' పాటతో ట్రెండింగ్‍‌లో పూజా హెగ్డే (ఫొటోలు)